నిహారిక పెళ్లికోసం ప్రత్యేక విమానంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ విలాస్ కు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తానికి మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలో పాలుపంచుకుంటున్నారు. పవన్ నిహారిక..

నిహారిక పెళ్లికోసం ప్రత్యేక విమానంలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ విలాస్ కు చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Updated on: Dec 08, 2020 | 10:06 PM

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తానికి మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుకలో పాలుపంచుకుంటున్నారు. పవన్ నిహారిక పెళ్లికి వెళ్తారా లేదా అనే సందేహాలకు తెరదించుతూ ప్రత్యేక విమానంలో మంగళవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు బయలుదేరారు. అనంతరం కొన్ని గంటల్లోనే వపన్ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తమ్ముడితో కలిసి ప్యాలెస్ లో నడుస్తోన్న ఫొటోను ఉంచి మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేశారు. రైతుల కోసం దీక్షలు, పర్యటనలు లాంటి రాజకీయ కార్యక్రమాల హడావిడిలో ఉండటంతో ఆయన వివాహారానికి వెళ్లలేరని కొందరు, వెళ్తారని కొందరు అంటూ వచ్చారు. అయితే పవన్ పనులన్నింటినీ ముగించుకుని ఈ సాయంత్రం పవన్ ఉదయపూర్ బయలుదేరారు. ఉదయ్‌ విలాస్‌లో డిసెంబర్‌ 9న అనగా రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది.