తెలంగాణ గవర్నర్ కి పవర్ స్టార్ పెద్ద థ్యాంక్స్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలకోసం..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలకోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా స్పూర్తిదాయకం మేడమ్ గవర్నర్ అంటూ పవన్ వినమ్రంగా కృతజ్ణతలు చెప్పారు. ఇలాఉండగా, పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షల సందేశాన్ని తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మంచి ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తమిళసై ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఇవాళ అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పినవారిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు మంచి ఆయురారోగ్యాలతో, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.???#PawannKalyanBirthday #Telangana #Governor #TamilisaiSoundararajan pic.twitter.com/jz80U5jawP
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 2, 2020
Hon @DrTamilisaiGuv “Thank You Dr.Tamilisai Soundararajan garu for your kind wishes. Your reach out programs to people of Telangana is truly inspiring. My Warm Regards to you Madam Governor”.?
— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2020
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు Sri @somuveerraju గారికి.. మీరు అందించిన శుభాకాంక్షలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. దశాబ్దాల మీ సుధీర్ఘ రాజకీయ అనుభవం జనసేన-బీజేపీ కూటమిని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు తీసుకువెళుతుంది..?
— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2020