బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా.. కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం పడిగాపులు గాస్తోన్న ప్రయాణికులు.

బ్రిటన్‌లో పురుడు పోసుకున్న కొత్త కరోనా వైరస్ భారత్‌లో అలజడి రేపుతోంది. దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త వైరస్‌ను రాకుండా చూడాలని ప్రభుత్తం చేపడుతోన్న చర్యలకు బ్రిటన్‌ నుంచి భారత్‌కు వస్తోన్న విమానాలు ఆటంకంగా మారతున్నాయి.

బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా.. కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం పడిగాపులు గాస్తోన్న ప్రయాణికులు.
Follow us

|

Updated on: Dec 24, 2020 | 2:16 PM

Passengers from UK Flights Test Covid-19: బ్రిటన్‌లో పురుడు పోసుకున్న కొత్త కరోనా వైరస్  భారత్‌లో అలజడి రేపుతోంది. దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త వైరస్‌ను రాకుండా చూడాలని ప్రభుత్తం చేపడుతోన్న చర్యలకు బ్రిటన్‌ నుంచి భారత్‌కు వస్తోన్న విమానాలు ఆటంకంగా మారతున్నాయి. తాజాగా బ్రిటన్ నుంచి భారత్‌కు చేరకుకున్న విమాన ప్రయాణికుల్లో 20 మందికిపైగా కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. మంగళ, బుధ వారాల్లో భారత్‌ చేరుకున్న ప్రయాణికులను క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. దీంతో బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికులు తమ రిపోర్టుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రిటన్‌లో కొత్త వైరస్ కలకలం రేపుతోన్న నేపథ్యంలో డిసెంబర్‌ 22 నుంచి 31 వరకు విమాన సర్వీసులను భారత్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. నిషేధానికి ముందు రోజు వరకు యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్‌ తప్పనిసరి చేస్తూ విమానాశ్రయ అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది.