గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

కోవిద్-19 సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు

  • Updated On - 11:35 am, Mon, 27 July 20 Edited By:
గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

కోవిద్-19 సంక్షోభం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిన విద్యార్థులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇవ్వాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షలు రాసి, పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు, పరీక్ష ఫీజు చెల్లించి ఒకటీ రెండు సబ్జెక్టులు రాయలేక పోయిన వారందరికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్‌ మార్కులను ఇచ్చి పాస్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఫలితాలను ప్రకటించనుంది.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మేలో నిర్వహించాల్సిన ఇంటర్  అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దుచేసిన సంగతి విదితమే. దీంతో ఆ పరీక్షలకు హాజరయ్యే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి కంపార్ట్‌మెంటల్‌లో పాసైనట్లుగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది.

సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థుల ఫస్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్స్‌ (ఫెయిలైన సబ్జెక్టులు) కూడా పాస్‌చేసేలా బోర్డు చర్యలు చేపట్టింది. సెకండ్ ఇయర్ లో ఫెయిలైన సబ్జెక్టులే కాకుండా ఫస్ట్ ఇయర్ లో మిగిలిపోయిన సబ్జెక్టుల్లో కూడా ఆయా విద్యార్థులను పాస్‌ చేయనుంది.