హీరో ధనుష్‌కు మదురై హైకోర్టు షాక్…బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?
రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ నిజజీవితం ఇప్పుడు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. హీరో ధనుష్ తమ కొడుకే అని, చిన్నతనం మందలిస్తే..ఇంటి నుంచి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నాన్చివేత దోరణిని అవలంభించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్‌కి షాక్ ఇచ్చింది.
రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ నిజజీవితం ఇప్పుడు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. హీరో ధనుష్ తమ కొడుకే అని, చిన్నతనంలో మందలిస్తే..ఇంటి నుంచి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నాన్చివేత దోరణిని అవలంభించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్‌కి షాక్ ఇచ్చింది.
తాజాగా జరిగిన విచారణలో ధనుష్ జనన, విద్య, ఇంటికి సంబందించిన ఒరిజినల్ సర్టిపికెట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. ఇంత జరుగుతున్నా ధనుష్ జనన సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్‌ను ఆదేశించింది. మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ..తామెవరో తెలయదంటే భరించలేకపోతున్నాం అని కదిరేశన్ దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయిస్తే అసలు నిజం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపారు. గతంలో ధనుశ్ పుట్టుమచ్చులు చెరిపించుకున్నాడనే వ్యవహారం కూడా సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ ప్రొఫిషన్‌లో భాగంగానే అలా చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు అతడు. ముందు ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
ఇది కూడా చదవండి : వావ్..మహేశ్ ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు సర్ప్రైజ్లు