AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీసీఏ నేపథ్యం.. ఇండియాపై మళ్ళీ విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై మళ్ళీ విషం చిమ్మారు. తమ దేశం అంతర్జాతీయ దేశాల మద్దతు పొందేందుకు ‘ కొత్త స్కెచ్ ‘ గీశారు. భారత దేశానికి దీటైన జవాబు ఇస్తామని బీరాలు పలికారు. పౌరసత్వ చట్టంపై ఇండియాలో దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాకాండను, అల్లర్లను ప్రస్తావించిన ఆయన.. భారత ప్రభుత్వం అంతర్గతంగా తలెత్తిన అరాచక పరిస్థితులనుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ దేశం (ఇండియా) హిందూ నేషనలిజాన్ని సమీకరించి వార్ (యుధ్ధ) […]

సీసీఏ నేపథ్యం.. ఇండియాపై మళ్ళీ విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్
Pardhasaradhi Peri
|

Updated on: Dec 22, 2019 | 4:01 PM

Share

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై మళ్ళీ విషం చిమ్మారు. తమ దేశం అంతర్జాతీయ దేశాల మద్దతు పొందేందుకు ‘ కొత్త స్కెచ్ ‘ గీశారు. భారత దేశానికి దీటైన జవాబు ఇస్తామని బీరాలు పలికారు. పౌరసత్వ చట్టంపై ఇండియాలో దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాకాండను, అల్లర్లను ప్రస్తావించిన ఆయన.. భారత ప్రభుత్వం అంతర్గతంగా తలెత్తిన అరాచక పరిస్థితులనుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ దేశం (ఇండియా) హిందూ నేషనలిజాన్ని సమీకరించి వార్ (యుధ్ధ) హిస్టీరియాకు తెర తీసిన పక్షంలో తమ దేశం మౌనంగా ఉండదని, గట్టి జవాబు ఇచ్చి తీరుతుందని హెచ్ఛరించారు. ‘ప్రస్తుతం ఇండియా నుంచి మాకు ముప్పు పొంచి ఉంది..జమ్మూ కాశ్మీర్లో నిషేధాజ్ఞలను ఎత్తివేస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుంది ‘ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. రక్తపాతం తప్పదన్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి ఎప్పుడైనా భగ్గుమనవచ్చునన్న భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలను ఇమ్రాన్ ప్రస్తావిస్తూ. ఇది పూర్తిగా ప్రజలను పక్కదారి మళ్లించడమేనని విమర్శించారు. ఆ రేఖ పొడవునా గల సెక్టార్లలో ఇండియా తప్పుడు మార్గంలో జాతీయ పతాకాలను ఎగురవేసి.. ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. భారత దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలను ఇమ్రాన్ ఖాన్.. ‘ మాస్ మూవ్ మెంట్ ‘ అంటూ అభివర్ణించాడు. మోదీ ప్రభుత్వం హిందూ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతోందని, గత అయిదేళ్లుగా ఇండియాలో ఈ పంథా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నాడు. ‘ ఆ దేశ ప్రభుత్వానిది సూపర్ మాసిస్ట్, ఫాసిస్ట్ ఐడియాలజీ ‘ అని ఇమ్రాన్ విషం కక్కాడు. కాశ్మీర్ విషయంలో తాము ఎంతవరకైనా వెళ్తామని గతంలో చెప్పిన మాటను ఇమ్రాన్ పునరుద్ఘాటించాడు. అయితే సీసీఏ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా పూర్తిగా సమర్థించింది. ఐరాస సమావేశాల్లో పాకిస్తాన్ ఒకవేళ ఈ అంశాన్ని లేవనెత్తినా… పాక్ కు భంగపాటు తప్పదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ అంశంలో భారత్ ను తప్పు పట్టడానికి ఆ దేశం చేసిన యత్నాలు ఫలించలేదుకూడా..