ఏపీలో ఇక పెయిడ్ క్వారెంటైన్.. కేంద్రానికి రిపోర్టు

ఏపీలో ఇక పెయిడ్ క్వారెంటైన్.. కేంద్రానికి రిపోర్టు

ఏపీలో ఇక కరోనా కట్టడికి పెయిడ్ క్వారెంటైన్ ఏర్పాట్ల మొదలయ్యాయి. ఎవరైనా విదేశాల నుంచి వస్తే వారికి పెయిడ్ క్వారెంటైన్ వసతిని హోటళ్ళు, రిసార్టుల్లో కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికార యంత్రాంగం నివేదించింది

Rajesh Sharma

| Edited By: Anil kumar poka

May 08, 2020 | 3:22 PM

ఏపీలో ఇక కరోనా కట్టడికి పెయిడ్ క్వారెంటైన్ ఏర్పాట్ల మొదలయ్యాయి. ఎవరైనా విదేశాల నుంచి వస్తే వారికి పెయిడ్ క్వారెంటైన్ వసతిని హోటళ్ళు, రిసార్టుల్లో కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికార యంత్రాంగం నివేదించింది. అదే సందర్భంలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ఎక్కువగా ప్రబలడానికి కారణమేంటనే విషయంపై కేంద్ర బృందం ఆరా తీసినట్లు సమాచారం.

ఏపీ రాష్ట్రంలోని కరోనా వైరస్ వ్యాప్తి, స్థానిక పరిస్థితులను అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. శనివారం నుంచి గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు కేంద్ర అధికారులు. వారికి రాష్ట్రంలో పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్.

ఏపీలో పర్యటిస్తున్న వారిలో డాక్టర్ వివేక్ అధిష్, డాక్టర్ రుశి గైలాంగ్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాకు డాక్టర్ సంజయ్ సాధు, డాక్టర్ ఎం.డోబె. గుంటూరు జిల్లాకు డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ నందిని భట్టాచార్య, వెళ్ళనున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. 3 రోజుల క్రితం 10 వేల కోవిడ్ పరీక్షలు చేశామని కేంద్ర బృందానికి తెలిపారు. ఇప్పటి వరకు లక్షా 84 వేల శాంపిల్ తీసుకున్నామని, ఇంకా 23 వేల 539 శాంపిల్ పలితాలు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర బృందానికి తెలిపారు. 2.07 శాతం మేర డెత్ రేట్ ఉందని, మిగిలిన రాష్ట్రాల కంటే డెత్ రేట్ విషయంలో మెరుగ్గానే ఉన్నామని తెలిపారు.

అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో పెయిడ్ క్వారంటైన్ సదుపాయం ఉందా అని కేంద్ర బృందం ఆరాతీసింది. విదేశాల నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమం మొదలైన దరిమిలా పెయిడ్ క్వారెంటైన్‌పై దృష్టి సారించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. విదేశాల నుండి వచ్చే ఎన్.ఆర్.ఐ.లు కావాలంటే హోటళ్ళలో పెయిడ్ క్వారెంటైన్ సదుపాయం కల్పించేందుకు రెడీ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎంత మంది హెల్త్ కేర్ వర్కర్లు వైరస్ బారిన పడ్డారని ఆరా తీసింది కేంద్ర బృందం. 67 మంది వైద్యసిబ్బందికి కరోనా సోకినట్టు స్థానిక అధికారులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu