ప‌రిహారం విష‌యంలో సీఎం సూప‌ర్బ్…అధికారుల ప్ర‌శంస‌లు

ప‌రిహారం విష‌యంలో సీఎం సూప‌ర్బ్...అధికారుల ప్ర‌శంస‌లు

విష‌వాయివు లీకై విశాఖలో మృతి చెందినవారి కుటుంబాలకు కోటి రూపాయలు ప‌రిహారం అందిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఆస్ప‌త్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ. 25000, రెండు మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సివ‌చ్చిన‌వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందే వారికి రూ. 10 ల‌క్ష‌ల‌ ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అందించిన‌ తరువాతే ఈ మొత్తం వారికి అందిస్తామని సీఎం జగన్ […]

Ram Naramaneni

|

May 08, 2020 | 3:27 PM

విష‌వాయివు లీకై విశాఖలో మృతి చెందినవారి కుటుంబాలకు కోటి రూపాయలు ప‌రిహారం అందిస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఆస్ప‌త్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న వారికి రూ. 25000, రెండు మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సివ‌చ్చిన‌వారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందే వారికి రూ. 10 ల‌క్ష‌ల‌ ఆర్థిక సాయం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ అందించిన‌ తరువాతే ఈ మొత్తం వారికి అందిస్తామని సీఎం జగన్ వెల్ల‌డించారు.

మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించినందుకు సీఎంను అధికారులు ప్రశంసించారు. దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై సీఎం జ‌గ‌న్ ఆదర్శంగా నిలిచారన్నారు అధికారులు. గతంతో తూర్పుగోదావరి జిల్లాలో నగరంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించానని గుర్తుచేసిన జ‌గ‌న్…ఆ సందర్భంలో ఇతరదేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో.. అదేరకంగా సహాయం చేయమని డిమాండ్‌ చేశానని చెప్పుకొచ్చారు. మరణించినవారి కుటుంబాలకు భారీగా పరిహారం ఇవ్వాల్సిందిగా ఆరోజు తాను డిమాండ్‌ చేశానని జ్ఞాపకం చేసుకున్న సీఎం…ఈ సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు

దేశంలో ఎక్కడోచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, కాని విదేశాల్లో ఇదే ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి వ్యవస్థలు ఏరకంగా స్పందిస్తాయో, ఏ రకంగా వ్యవహరిస్తాయో, అలాంటి స్పందన కచ్చితంగా చూపాల్సి ఉంటుందని జ‌గ‌న్ తెలిపారు. అందుకనే ఉదారంగా స్పందించామని అధికారులకు సీఎం స్పష్టంచేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu