ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

కోవిడ్‌ను సమ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను ఆరు వారాల్లో రెడీ చేసి, పరీక్షించగల స్థాయికి ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ/ ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టులు చేరుకున్నారని యూకేలోని ఒక పత్రిక కథనం పేర్కొంది. దీనిని సాధించడానికి వారు అతి చేరువ‌లో ఉన్నారని వెల్ల‌డించింది. కోవిడ్‌పై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్‌తో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయ‌ని తెలిపింది. ఒక పక్కఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌పై పోరులో కీలకమైన దశకు బ్రిటన్‌ చేరుకుంటుండగా, రెండోసారి ఈ మహమ్మారి విరుచుకుపడవచ్చనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శీతాకాలంలో పరిస్థితులు […]

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌  !
Ram Naramaneni

|

Sep 01, 2020 | 7:23 AM

కోవిడ్‌ను సమ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను ఆరు వారాల్లో రెడీ చేసి, పరీక్షించగల స్థాయికి ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ/ ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టులు చేరుకున్నారని యూకేలోని ఒక పత్రిక కథనం పేర్కొంది. దీనిని సాధించడానికి వారు అతి చేరువ‌లో ఉన్నారని వెల్ల‌డించింది. కోవిడ్‌పై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్‌తో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయ‌ని తెలిపింది. ఒక పక్కఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌పై పోరులో కీలకమైన దశకు బ్రిటన్‌ చేరుకుంటుండగా, రెండోసారి ఈ మహమ్మారి విరుచుకుపడవచ్చనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శీతాకాలంలో పరిస్థితులు మరింత ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read : ఆయన మరణం దేశానికి తీరని లోటు: ప్రణబ్‌ మృతిపై జగన్ దిగ్భ్రాంతి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu