AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎగవేతదారుల రుణాలను మాఫీ చేసిన ఆర్‌బీఐ..వారు ఎవ‌రో తెలుసా

ఎప్పటిలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెద్దల రుణాలను మాఫీ చేసింది. సామాన్యుడి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు బడాబాబుల ముందు మరోసారి చతికిలబడ్డాయి. ఇటీవల ఎగవేతదారులకు చెందిన వేలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎగవేత రుణాలను 68,607 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్‌బిఐ. ఈ జాబితాలో ట్రాన్స్‌ట్రాయ్‌, దక్కన్‌ క్రానికల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి […]

ఎగవేతదారుల రుణాలను మాఫీ చేసిన ఆర్‌బీఐ..వారు ఎవ‌రో తెలుసా
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2020 | 12:42 PM

Share

ఎప్పటిలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెద్దల రుణాలను మాఫీ చేసింది. సామాన్యుడి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు బడాబాబుల ముందు మరోసారి చతికిలబడ్డాయి. ఇటీవల ఎగవేతదారులకు చెందిన వేలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఎగవేత రుణాలను 68,607 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్‌బిఐ. ఈ జాబితాలో ట్రాన్స్‌ట్రాయ్‌, దక్కన్‌ క్రానికల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీకి చెందిన 1790 కోట్ల రుణాలను రద్దు చేసింది. దక్కన్‌ క్రానికల్‌ రుణం 1,915 కోట్ల రూపాయలను రద్దు చేసింది ఆర్‌బిఐ.

గతంలో బ్యాంకులను మోసం చేసిందని ట్రాన్స్‌ట్రాయ్‌పై సీబీఐ కేసు పెట్టింది. రుణాల రద్దు అంశమై ఆర్‌టిఐ యాక్ట్‌ ద్వారా వివరాలు సేకరించారు సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే. ఎగవేతదారుల రుణాలను రద్దు చేయడాన్ని తప్పుపట్టింది ప్రతిపక్ష కాంగ్రెస్‌. ఆర్‌బిఐ రుణాలను రద్దు చేసిన వారంతా బీజేపీ మిత్రులేనని ఆరోపించింది. రుణాల వసూలులో విఫలమయ్యారని విమర్శించారు రాహుల్‌గాంధీ. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిన విజయ్ మాల్యా, డైమండ్స్ టైకూన్ మెహుల్ ఛోక్సీ రుణాలను కూడా మాఫీ చేసింది ఆర్‌బిఐ. రుణ మాఫీ చేసిన కంపెనీల్లో 5,492 కోట్ల రూపాయలతో గీతాంజలి జెమ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆర్‌ఇఐ ఆగ్రో 4,314 కోట్ల రూపాయలు, విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీ 4,076 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. బాబా రాందేవ్ అండ్ బాల‌కృష్ణ గ్రూప్ కూడా ఈ జాబితాలో ఉంది.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?