జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్​ షోపియాన్​లో​ టెర్ర‌రిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది హతమయ్యాడు. ముష్క‌రులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి.

జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 21, 2020 | 9:54 AM

జమ్మూ కాశ్మీర్​ షోపియాన్​లో​ టెర్ర‌రిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది హతమయ్యాడు. ముష్క‌రులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్ర‌వాదులు. ఈ ఆపరేషన్​లో భారీగా వెప‌న్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అధికారులు. సోదాలు కొనసాగుతున్నాయ‌ని వివ‌రించారు. శ్రీనగర్​లోని జాదిబాల్ ఏరియాలో టెర్రిరిస్టులున్నార‌నే పక్కా ఇన్ఫ‌ర్మేష‌న్ తో తనిఖీలు చేపట్టింది ఆర్మీ. ఆప‌రేష‌న్ లో భాగంగా ముందుగా ఆ ప్రాంతంలో మొబైల్​, ఇంటర్నెట్​ సేవలను నిలిపివేసి సెర్చింగ్ నిర్వహించింది.

ఇదే సమయంలో పూంచ్​ జిల్లా బాలకోట్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఆదివారం ఉదయం 6.15 గంటలకు, మోర్టార్​ షెల్స్​తో దాడులు చేసింది పాక్​ ఆర్మీ. అయితే పాక్ దుశ్చర్యను భారత ద‌ళాలు సమర్థంగా తిప్పికొట్టాయి.