AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాతాలోని నగదు కోసం మంచంతో సహా లాక్కెళ్లిన మహిళ..!

ప్రభుత్వం వేసిన ఫించన్ డబ్బులను తీసుకునేందుకు మంచానపడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకుకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళ.

ఖాతాలోని నగదు కోసం మంచంతో సహా లాక్కెళ్లిన మహిళ..!
Balaraju Goud
|

Updated on: Jun 15, 2020 | 1:06 PM

Share

ఒడిశాలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం వేసిన ఫించన్ డబ్బులను తీసుకునేందుకు మంచానపడ్డ తల్లిని రోడ్డుపై బ్యాంకుకు ఈడ్చుకెళ్లింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నౌపారా జిల్లాకు బార్గావున్‌కు చెందిన‌ పుంజీమ‌తి దేవి బ్యాంకు ఖాతాలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.1500 జ‌మ చేసింది. కూలీ పని చేసుకునే ఆ కుటుంబం నిత్యావసరాలు కొనుక్కునేందుకు డబ్బుల అవసరం ఏర్పడింది. దీంతో బ్యాంకులో జమ చేసిన నగదును తీసుకోవాలని భావించింది ఆమె కూతురు. స‌ద‌రు మ‌హిళ జూన్ 9న ఉత్క‌ల్ గ్రామీణ‌ ‌బ్యాంకుకు వెళ్లి తన తల్లి ఖాతాలోని నగదు కావాలని బ్యాంక్ అధికారులను కోరింది. అయితే ఖాతాదారు ఉంటేనే డ‌బ్బులు ఇస్తామ‌ని బ్యాంకు మేనేజర్ అజిత్ ప్ర‌ధాన్‌ తేల్చి చెప్పాడు. దీంతో ఆమె గత్యంత‌రం లేని ప‌రిస్థితిలో మంచాన ప‌డ్డ వందేళ్ల వ‌య‌సున్న త‌ల్లిని బ్యాంకు వ‌ర‌కూ మంచంతో సహా లాక్కుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ధుస్మిత సాహో స్పందించారు. మహిళ తొందరపాటు వల్లే ఇలా జరిగిందన్నారు. బ్యాంకు మొత్తాన్ని ఒక‌రే నిర్వ‌హిస్తుండడంతో అదే రోజు ఆమె ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వడం వీలుకాలేదన్నారు. మరుసటి రోజు మ‌హిళ ఇంటికి వ‌స్తాన‌ని చెప్పాడు. కానీ ఆమె వినిపించుకోకుండా త‌ల్లిని మంచంలో వేసి తీసుకువచ్చి డబ్బులు తీసుకుందని కలెక్టర్ తెలిపింది.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..