AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన ఘటన.. క్వారంటైన్ కేంద్రంలో కళ్యాణం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ప్రేమికులు అక్కడే కళ్యాణం చేసుకున్న అరుదైన ఘటన

అరుదైన ఘటన.. క్వారంటైన్ కేంద్రంలో కళ్యాణం..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 10:42 AM

Share

Marriage in quarantine centre: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. కరోనా లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ప్రేమికులు అక్కడే కళ్యాణం చేసుకున్న అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్ అనే 19 ఏళ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణిని ప్రేమిస్తున్నాడు. సౌరబ్ తన ప్రేయసి పింకీరాణిని తీసుకొని ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి పారిపోయి, ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ప్రేయసితో సహజీవనం సాగించాడు.

కాగా.. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. గుజరాత్ నుంచి ఒడిశాకు తిరిగివచ్చిన ప్రేమ జంటకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అయినా ముందుజాగ్రత్తగా వారిని 14 రోజుల పాటు సాగాడ గ్రామంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రేమజంట అహ్మదాబాద్ లో సహజీవనం చేయడంతో పింకీరాణి గర్భం దాల్చింది.

ఈ క్రమంలో.. 14 రోజుల క్వారంటైన్ సమయం ముగిశాక క్వారంటైన్ కేంద్రమే కళ్యాణ వేదికగా ప్రేమజంట సౌరబ్, పింకీరాణిలు పెళ్లి చేసుకున్నారు. వధూవరుల కుటుంబసభ్యులు క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించలేనందున ఈ కేంద్రం ఇన్‌చార్జులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులగా వ్యవహరించారు. సాగాడ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమజంట వివాహానికి సహాయపడ్డారు.

Also Read: మనసున్న రైతు.. వ‌ల‌స కూలీలకు విమాన టిక్కెట్లు..!

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే