AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. గత వారం రోజుల నుంచే మహేష్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు.

జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2026 | 7:12 AM

Share

నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. గత వారం రోజుల నుంచే మహేష్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా, సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ . సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. 1979లో వచ్చిన ‘నీడ’ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు.

రాజకుమారుడు తర్వాత మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలా వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. మహేష్ సినిమాలు రిలీజ్ టైం లోనే కాదు రీ రిలీజ్ ల్లోనూ థియేటర్ల దుమ్ముదులుపుతున్నాయి. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మహేష్ బాబు సూపర్ స్టారే..

ఇవి కూడా చదవండి

తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్న మహేష్ .. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయిస్తూ ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచారు. మహేష్ బాబు కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా భారీగా సంపాదిస్తున్న మహేష్ బాబు.. తన సంపాదంలో లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేస్తారు.మహేష్ బాబు ఏపీ లోని స్వగ్రామమైన బుర్రిపాలెం సహా తెలంగాణ లోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఇక నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, ఆయన అభిమానులు, యావత్ ప్రపంచమంతా ఉన్న తెలుగు సినిమా ఆడియన్స్ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం వారణాసి, ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజుకు విషెస్ తెలుపుతూ సినిమా నుంచి మహేష్ లుక్స్ ను విడుదల చేశారు. ఆ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల