AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: చికెన్ ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. భారీగా పడిపోయిన ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

సామాన్యులకు గుడ్ న్యూస్, చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల కిలో చికెన్ రూ.330 వరకు చేరుకోగా.. ఒక్కో గుడ్డు రూ.10 పలికింది. అయితే ఇప్పుడు చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా భారీగా పడిపోయాయి. డిమాండ్ పెరగంతో ధరలు తగ్గాయి.

Chicken Prices: చికెన్ ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. భారీగా పడిపోయిన ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Aug 09, 2026 | 7:41 AM

Share

చికెన్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో రూ.300 వరకు చేరుకుని సామాన్యులను షాక్‌కు గురి చేశాయి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి చికెన్ ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో నాన్ వెజ్ తినేవారు ఊరట చెందుతున్నారు. తెలంగాణలో బోనాల సందర్భంగా చికెన్ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. బోనాలతో పాటు ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. ఈ సమయంలో ధరలు తగ్గడం పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.240 వద్ద కొనసాగుతుండగా.. డ్రెస్సెడ్ చికెన్ రూ.212గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.137గా ఉండగా.. ఎక్స్ ఫారం ధర రూ.110 పలుకుతోంది. ఇక కరీంనగర్ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.240, డ్రస్స్‌డ్ రూ.212, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.110 పలుకుతోంది. ఇక విజయవాడలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.250 వద్ద ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.117, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144 పలుకుతోంది.  అటు హైదరాబాద్ జోన్‌లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.74గా ఉండగా.. విజయవాడ జోన్‌లో రూ.80 పలుకుతోంది.

తగ్గిన గుడ్ల ధరలు..

ఇక కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఇటీవల ఒక్కొ గుడ్డు ధర రూ.10కి చేరుకోగా.. సామాన్యులపై ధరల భారం పడింది. అయితే ఇప్పుడు చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా తగ్గాయి. ఇప్పుడు ఒక్కొ గుడ్డు ధర రూ. 6 నుంచి రూ.7 మధ్య పలుకుతోంది. డిమాండ్‌లో మార్పులు చోటుచేసుకోవడం, దిగుబడి పుంజుకోవడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. నెల రోజులుగా చికెన్, గుడ్ల ధరలు తగ్గుతూ వస్తోండగా.. సామాన్యులపై భారం పడింది. ఇప్పుడు తగ్గడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు గుంటూరులో కిలో చికెన్ రూ.280, కడప, మార్కాపురం జిల్లాల్లో రూ.260, నిజామాబాద్, ఖమ్మం జోన్‌లో రూ.280, కామారెడ్డిలో రూ.270 పలుకుతున్నాయి.  అటు కూరగాయల ధరలు కూడా తగ్గిపోతూ వస్తోన్నాయి. వర్షాలు పడటం, పంట దిగుబడి పెరగడంతో ధరలు దిగొస్తున్నాయి. ఇటీవల కూరగాయల ధరలు పెరగ్గా.. ఇప్పుడు అవి కూడా తగ్గుతూ వస్తోన్నాయి.

Follow Us