మనసున్న రైతు.. వ‌ల‌స కూలీలకు విమాన టిక్కెట్లు..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. నేను విమానంలో కూర్చుంటాన‌ని ఎప్పుడూ అనుకోలేదు.

మనసున్న రైతు.. వ‌ల‌స కూలీలకు విమాన టిక్కెట్లు..!
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 10:24 AM

Delhi Mushroom Farmer: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అయితే.. నేను విమానంలో కూర్చుంటాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. మా య‌జ‌మాని మాకు విమానం టిక్కెట్లు కొని ఇచ్చారు.. అని ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఐజిఐ విమానాశ్రయంలో తెలిపారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేప‌ధ్యంలో ప‌లువు‌రు య‌జ‌మానులు వ‌ల‌స కార్మికుల పాలిట జీతాలు ఇవ్వ‌కండా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించార‌నే వార్త‌లు విన్నాం.

వివరాల్లోకెళితే.. ఈ ప‌దిమంది వ‌ల‌స కూలీల య‌జ‌మాని ప‌ప్ప‌న్ గ‌హ్లాట్‌ వీరి పాలిట దేముడ‌య్యాడు. పప్పన్ తన సొంత డబ్బుతో వీరికోసం విమాన‌‌ టికెట్లు కొని స్వ‌స్థ‌లాల‌కు పంపించారు. ఇందుకోసం అతనికి 68 వేల రూపాయలు ఖర్చయ్యాయి. ప‌ప్ప‌న్ గ‌త 20 సంవ‌త్స‌రాలుగా పుట్ట‌గొడుగుల వ్యాపారం సాగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే ప‌దిమంది వ‌ల‌స కూలీలు త‌మ స్వ‌గ్రామానికి వెళ్లాల‌ని భావించారు.

కాగా.. వారి ద‌గ్గ‌ర డ‌బ్బులేక‌పోవ‌డంతో ఈ విష‌యాన్ని య‌జ‌మానికి తెలిపారు. దీంతో ఆయ‌న వారి కోసం విమాన టిక్కెట్లు కొని బీహార్‌లోని పట్నాకు పంపించారు.