AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తక్కువ బడ్జెట్‌లో కీప్యాడ్ ఫోన్‌ కావాలా..? భారీ బ్యాటరీతో ఐటెల్‌ ఐస్‌3 ధర ఎంతంటే

Itel Ace 3.. బడ్జెట్ ధరలో నమ్మకమైన కీప్యాడ్ ఫోన్ కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ ఐటెల్ భారత మార్కెట్లో సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరించింది. అధునాతన ఛార్జింగ్ సపోర్ట్, శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అత్యంత తక్కువ ధరకే లభించే ఈ నూతన పరికరానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.

తక్కువ బడ్జెట్‌లో కీప్యాడ్ ఫోన్‌ కావాలా..? భారీ బ్యాటరీతో ఐటెల్‌ ఐస్‌3 ధర ఎంతంటే
Itel Ace 3 Heera Feature Phone
Nikhil
|

Updated on: Aug 09, 2026 | 7:20 AM

Share

బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం ఐటెల్ భారత మార్కెట్లో ఐస్ 3 హీరా పేరుతో కొత్త కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర కేవలం తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే. ముఖ్యంగా, ఈ ధరలో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ అందించిన తొలి ఫీచర్ ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు ఈ ధరలో లభించే చాలా ఫీచర్ ఫోన్లలో మైక్రో-యూఎస్‌బీ పోర్ట్ ఉండేది. అయితే ఐస్ 3 హీరాలో టైప్-సీ పోర్ట్ ఇవ్వడం వల్ల ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు ఉపయోగించే ఛార్జింగ్ కేబుల్‌తోనే ఈ ఫోన్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

భవిష్యత్తులో తమ అన్ని ఫీచర్ ఫోన్లలో టైప్-సీ పోర్ట్‌ను అందించనున్నట్లు ఐటెల్ వెల్లడించింది. ఈ ఫోన్‌లో 1.8 అంగుళాల డిస్‌ప్లే ఉంది. వెయ్యి ఎంఏహెచ్ బ్యాటరీని అందించగా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే పదమూడు రోజుల వరకు స్టాండ్‌బై సమయం అందుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, సూపర్ బ్యాటరీ మోడ్ వంటి ఫీచర్లు బ్యాటరీ వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాయి.

వాయిస్ అసిస్టెంట్

ఐస్ 3 హీరాలో హిందీ, ఇంగ్లీష్ భాషలకు మద్దతు ఇచ్చే కింగ్ టాకర్ వాయిస్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. అలాగే వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, ఎఫ్‌ఎం రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్, డ్యూయల్ సిమ్, ఫ్లాష్‌లైట్, బ్లూటూత్, 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 32ఎంబీ ర్యామ్, 32ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. మెమరీ కార్డ్‌లోని పాటలను నేరుగా రింగ్‌టోన్‌లుగా సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే రెండు వందల కాంటాక్ట్‌ల వరకు సేవ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.

లభ్యత వివరాలు

ఐటెల్ ఐస్ 3 హీరా ధర రూ. 949గా ఉంది. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో కాలింగ్, మెసేజింగ్, ఎఫ్‌ఎం రేడియో, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా నిలవొచ్చు. సాధారణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పరికరం మార్కెట్లో మంచి ఆధారణ పొందే అవకాశం ఉంది.

Follow Us
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!