AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్‌

Pova AI Buds.. స్మార్ట్ గ్యాజెట్ల మార్కెట్లో వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో కూడిన ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న కొత్త ఇయర్ బడ్స్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

వైర్‌‌లెస్‌ ఇయర్‌‌బడ్స్‌ కొనాలనుకునే వాళ్లకి గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్‌
Pova Ai Buds Pro
Nikhil
|

Updated on: Aug 09, 2026 | 7:50 AM

Share

టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు సామాన్య ప్రజలను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలను అందించే పరికరాలు నిత్య జీవితంలో భాగం అవుతున్నాయి. వినియోగదారుల అంచనాలను అందుకునేందుకు తయారీదారులు వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు.

డిజైన్ ప్రత్యేకతలు

పోవా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఈ మోడల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజమైన అమెజాన్ వేదికగా ఈ ఇయర్ బడ్స్ ఎక్స్‌క్లూజివ్‌గా సేల్‌కు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే అమెజాన్‌లో స్పెషల్ డిస్కౌంట్లు కూపన్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఇయర్ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే ఇది పూర్తిగా ప్రీమియం ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తోంది.

చెవిలో సౌకర్యవంతంగా ఇమిడిపోయేలా ఎర్గోనామిక్ డిజైన్‌ను అందించారు. అంతేకాకుండా దీని స్టైలిష్ కేస్ లైట్‌వెయిట్ బిల్డ్ క్వాలిటీ కారణంగా ప్రయాణాల్లో వీటిని ఉపయోగించడం చాలా ఈజీ. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా దీని కలర్ ఆప్షన్లు కూడా ట్రెండీగా డిజైన్ చేశారు.

ఏఐ ఫీచర్లు

ఈ బడ్స్ ప్రధాన ఆకర్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసరమైన శబ్దాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పూర్తిగా కట్ చేసి క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ని అందిస్తుంది. అలాగే డీప్ బేస్ పవర్‌ఫుల్ డ్రైవర్ల కారణంగా పాటలు వినేటప్పుడు థియేటర్ లాంటి ఆడియో ఫీల్ ఇస్తుంది. గేమింగ్ ఆడేవారి కోసం ప్రత్యేకంగా లో-లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఉండనుంది. ప్రస్తుత జనరేషన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని పవర్‌ఫుల్ బ్యాటరీ లైఫ్‌ను అందించారు. సింగిల్ చార్జ్‌తో ఇవి ఎక్కువ కాలం పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్‌ను అందిస్తాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటల తరబడి వాడొచ్చు.

ఫీచర్ల పరంగా ప్రీమియంగా ఉన్నప్పటికీ సాధారణ మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా వీటి ధరను నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఇయర్ బడ్స్ ధర సుమారు రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది.

లాంచ్ రోజున అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లతో మరింత తక్కువ ధరకు కూడా కొనే అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఏఐ ఫీచర్లు ప్రీమియం సౌండ్ కోరుకునే వారికి ఈ కొత్త బడ్స్ మంచి ఆప్షన్ కానుంది. అమెజాన్‌లో త్వరలోనే లాంచ్ కానున్న ఈ గ్యాజెట్ కోసం టెక్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ గార్జెట్ కొనాలనుకునే వారు లాంచ్ ఈవెంట్ ఆఫర్ల కోసం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us