సంచలనాలు, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్​ ల్యాండ్’​ పుస్తకం

అగ్రరాజ్యాన్ని రెండుసార్లు పాలించిన నేత. ఎన్నో సంఘటనలు.. మరెన్నో వాస్తవాలు.. అన్నింటినీ ఓ పుస్తకం చేసి పొందుపరిచారు. ఇప్పుడా బుక్‌ వండర్‌ క్రియేట్‌ చేసింది. కేవలం ఒక్కరోజులోనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయి రికార్డులు సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్​ ల్యాండ్’​ పుస్తకం.. రోజురోజుకీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తన జీవితంలో జరిగిన సంఘటనలు, రాజకీయ అనుభావాలను ఇందులో ఒబామా పొందరుపర్చారు. కేవలం ఒక్క రోజులోనే 8లక్షల 90వేల కాపీలు అమ్ముడయ్యాయి. […]

సంచలనాలు, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన 'ఏ ప్రామిస్డ్​ ల్యాండ్'​ పుస్తకం
Follow us
Venkata Narayana

|

Updated on: Nov 20, 2020 | 12:02 PM

అగ్రరాజ్యాన్ని రెండుసార్లు పాలించిన నేత. ఎన్నో సంఘటనలు.. మరెన్నో వాస్తవాలు.. అన్నింటినీ ఓ పుస్తకం చేసి పొందుపరిచారు. ఇప్పుడా బుక్‌ వండర్‌ క్రియేట్‌ చేసింది. కేవలం ఒక్కరోజులోనే అత్యధిక కాపీలు అమ్ముడుపోయి రికార్డులు సృష్టించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా రాసిన ‘ఏ ప్రామిస్డ్​ ల్యాండ్’​ పుస్తకం.. రోజురోజుకీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తన జీవితంలో జరిగిన సంఘటనలు, రాజకీయ అనుభావాలను ఇందులో ఒబామా పొందరుపర్చారు. కేవలం ఒక్క రోజులోనే 8లక్షల 90వేల కాపీలు అమ్ముడయ్యాయి. గత రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఈ పుస్తకాన్ని ముద్రించిన పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ లెక్కల ప్రకారం.. అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో ఇంత మొత్తంలో అమ్ముడయిన దాఖలాలు లేవు. 2017లో ఒబామా దంపతులు ఈ పుస్తకం కోసం 65 మిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపు 481 కోట్లు అన్నమాట. అమెరికాలో ఇదే అతిపెద్ద ఒప్పందం అని చెబుతున్నారు. తన రాజకీయ అనుభవాలు ప్రపంచ దేశాల అధినేతలతో పాటు భారత్‌ పర్యటన విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు ఒబామా. అమెరికా, కెనడాలో ఈ పుస్తకం ఎక్కువ ప్రజాధరణ పొందుతోంది. మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఆధునిక కాలంలో అనేక అంశాల్లో భారత్‌ది విజయగాథ అని.. భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఒబామా. మరీ ముఖ్యంగా రామాయణ, మహాభారతం గురించి ప్రత్యేకంగా రాసుకొచ్చారు. రాహుల్‌పై ఒబామా కామెంట్స్‌కు వ్యతిరేకంగా ఆయనపై కేసులు కూడా నమోదవుతున్నాయి.