ఎంపీటీసీ, ఎంపీపీల ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కుంచాల ప్రభాకర్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక మెదక్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా హేమల శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా లావణ్య రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి మదన్ రెడ్డిలు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో […]

ఎంపీటీసీ, ఎంపీపీల ప్రమాణస్వీకారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 12:38 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ చైర్మన్ల ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పట్లోళ్ల మంజుశ్రీ జైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా కుంచాల ప్రభాకర్‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఇక మెదక్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా హేమల శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షురాలిగా లావణ్య రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శేరిసుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి మదన్ రెడ్డిలు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఆస్క రవి, కో అప్షన్ మెంబర్ ఇస్మాయిల్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. ఎంపీడీఓ మధుసూదన్ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, టి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో కదిరి మండల ఎంపీపీగా సరళ పుల్ రెడ్డి ప్రమాణం చేశారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎంపీపీ ,ఎంపీటిసి సభ్యులకు మాజీ ఎమ్మేల్యే చింతప్రభాకర్ సన్మానం చేశారు. ఇక నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపితోపాటు ఎంపిటిసిలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వారందరిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మేడ్చల్ జిల్లా కీసర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాలరుపు ఇందిరా, వైస్ ఎంపీపీ జలాల్‌పురం సత్తిరెడ్డితోపాటు ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు భారీగా పాల్గొన్నారు.