AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట..! మీ బర్త్‌డే ఉందా..?

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల మూలాంకాన్ని లెక్కిస్తారు. కొన్ని మూలాంకాలకు చెందిన వారు చిన్న వయసులోనే ఆర్థికంగా ఎదిగి, జీవితంలో డబ్బుకు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోరని నమ్మకం ఉంది. ముఖ్యంగా 1, 3, 5, 6 మూలాంకాలకు చెందిన వారికి సంపద, ఆదాయం విషయంలో అనుకూలత ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సంపన్నులుగా మారే అవకాశం ఉందని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బుకు లోటు ఉండదట..! మీ బర్త్‌డే ఉందా..?
Numerology
Janardhan Veluru
|

Updated on: Sep 28, 2026 | 5:34 PM

Share

మన పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవనశైలిపై ప్రభావం చూపుతుందని న్యూమరాలజీ విశ్వాసం. ముఖ్యంగా పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించే మూలాంకం ద్వారా వ్యక్తుల ఆర్థిక పరిస్థితి, సంపాదించే విధానం, డబ్బును నిర్వహించే తీరు గురించి కొన్ని అంచనాలు వేయవచ్చని న్యూమరాలజీ చెబుతుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తులు చిన్న వయసు నుంచే ఆర్థిక విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తారని చెబుతారు. వీరు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డబ్బును పొదుపు చేయడంపై కూడా దృష్టి పెడతారని నమ్మకం. ఏయే తేదీల్లో పుట్టిన వారు ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలతో తమకు డబ్బు లోటు లేకుండా చూసుకుంటారో ఇప్పుడు చూద్దాం..

మూలాంకం 1

ముఖ్యంగా ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1 అవుతుంది. వీరిని సూర్యుడి ప్రభావంతో అనుసంధానిస్తారు. నాయకత్వ లక్షణాలు, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. అందుకే వీరికి డబ్బుకు లోటు ఉండదని చెబుతారు.

మూలాంకం 3

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 3. ఈ సంఖ్యను గురువుతో అనుసంధానిస్తారు. జ్ఞానం, ప్రణాళిక, ఆర్థిక అవకాశాలను గుర్తించే సామర్థ్యం వీరికి ఉంటుందని న్యూమరాలజీలో చెబుతారు. అందుకే ఆర్థికంగా వీరికి ఢోకా ఉండదని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

మూలాంకం 5

అలాగే 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 5. ఈ సంఖ్యకు బుధుడి ప్రభావం ఉంటుందని నమ్ముతారు. వ్యాపారం, కమ్యూనికేషన్, కొత్త అవకాశాల ద్వారా సంపాదనకు వీరికి ఆసక్తి ఉంటుందని భావిస్తారు. వీరికి ఆర్థికంగా మెరుగ్గా ఉంటారని చెబుతారు.

మూలాంకం 6

6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి మూలాంకం 6. ఈ సంఖ్యను శుక్రుడితో అనుసంధానిస్తారు. సౌకర్యవంతమైన జీవితం, సంపద, విలాసాలపై ఆసక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని న్యూమరాలజీ పేర్కొంటుంది. వీరికి ఆర్థికంగా ఎలాంటి లోటూ ఉండదని భావిస్తారు.

(గమనిక: అయితే ఇవన్నీ న్యూమరాలజీకి సంబంధించిన నమ్మకాలు మాత్రమే. ఒక వ్యక్తి జీవితంలో సంపద, ఆదాయం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించేది పుట్టిన తేదీ మాత్రమే అని శాస్త్రీయంగా నిరూపించబడలేదు)

Follow Us