మీ ఆధార్ అప్‏డేట్ చేయాలనుకుంటున్నారా ? ఇప్పుడు సులభంగా ఇంట్లో ఉండే ఆ పని చేయొచ్చు.. ఎలాగంటే..

ప్రస్తుత కాలంలో మన నిత్య జీవితంలో ఆధార్ ఓ భాగమై పోయింది. ఎక్కడికి వెళ్ళిన ఆధార్ మన చెంత ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల కోసమైన..

మీ ఆధార్ అప్‏డేట్ చేయాలనుకుంటున్నారా ? ఇప్పుడు సులభంగా ఇంట్లో ఉండే ఆ పని చేయొచ్చు.. ఎలాగంటే..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 10:29 AM

ప్రస్తుత కాలంలో మన నిత్య జీవితంలో ఆధార్ ఓ భాగమై పోయింది. ఎక్కడికి వెళ్ళిన ఆధార్ మన చెంత ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల కోసమైన.. స్కాలర్ షిప్‏లో కోసమైన ఆధార్ ఖచ్చితమే. అయితే చాలా మందికి తమ ఆధార్ కార్డులో తప్పులు జరిగాయి. ఉదాహరణకు పేరులో పొరపాట్లు లేదా పుట్టిన రోజు తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక ఆధార్ కార్డ్ అప్‏డేట్ చేయాలనుకుంటే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిందే. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఎక్కడికి వెళ్ళాలన్న భయం పట్టుకుంది. దీంతో ఆధార్ అప్‏డేట్‏కు యుఐడీఓఎఐ ఓ ప్రకటన చేసింది.

యుఐడీఎఐ చేసిన ట్వీట్ ప్రకారం.. ఆధార్ కార్డులో మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా మరియు భాషను మీరే అప్‏డేట్ చేసుకోవచ్చు. అందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదని పేర్కోంది. ఇంకా మిగతా సేవల అప్‏డేట్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి అని తెలిపింది.

ఆధార్ అప్‏డేట్ చేసుకోవడం ఎలా అంటే.. 1. ముందుగా ఆధార్ కార్డ్ అధికారిక వెబ్‏సైట్ (uidai.gov.in) ఓపెన్ చేయాలి. 2. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్ళి అప్‏డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‏లైన్ పై క్లిక్ చేయాలి. 3. అనంతరం ప్రొసీడ్ టూ అప్‏డేట్ ఆధార్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. 4. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. 5. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి. 6. ఆ తర్వాత మీకు అప్‏డేట్ డెమోగ్రాఫిక్ డేటా సెలక్ట్ చేసుకోవాలి. 7. అక్కడ ట్యాబ్‏లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం ఆప్షన్స్ కనిపిస్తాయి. 8. ఇక ఇందులో మీరు ఏదైతే అప్‏డేట్ చేయాలనుకుంటున్నారో దానిని సెలక్ట్ చేసుకోవాలి. 9. అన్ని వివరాలను ఫిల్ చేసిన తర్వాత, మీ ఐడిని అడ్రస్ ప్రూఫ్ గా అప్ లోడ్ చేసి.. దానిని పీడీఎఫ్, జేపీఇజీ లేదా పీఎన్‏జీలో అప్ లోడ్ చేయాలి. 10. మొత్తం ప్రక్రియ పూర్తైన వెంటనే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.50 చెల్లించాలి. 11. ఆన్లైన్ నగదు చెల్లింపు చేసిన తర్వాత మీకు వెంటనే కన్ఫార్మ్ అయ్యిందా లేదా అనే విషయం కోసం మీ మొబైల్ నంబరుకు URN కోడ్ వస్తుంది. ఇప్పుడు సులభంగా ఇంట్లో ఉండి మీ ఆధార్ కార్డు అప్‏డేట్ చేసుకోవచ్చు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో