కరోనాపై ఐఐపీహెచ్‌ అధ్యయనంలో సంచలన విషయాలు

కరోనాపై ఐఐపీహెచ్‌ అధ్యయనంలో సంచలన విషయాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. వైరస్ బారినపడి జనం పిట్టల్లా రాలుతున్నారు. అయితే, కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్‌ సోకుతుందని చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% మిగిలినవారికి మాత్రమే ఆ వైరస్‌ సోకకపోవచ్చని ఓ అధ్యయనంలో తేలింది

Balaraju Goud

|

Aug 03, 2020 | 6:06 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. వైరస్ బారినపడి జనం పిట్టల్లా రాలుతున్నారు. అయితే, కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్‌ సోకుతుందని చెప్పలేమంటున్నారు సైంటిస్టులు. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% మిగిలినవారికి మాత్రమే ఆ వైరస్‌ సోకకపోవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. వైరస్‌ నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా సోకే ప్రమాదం లేదని గుజరాత్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.

వైరస్‌ సోకిన వ్యక్తిని కలిసిన అందరికీ అది సోకుతుందని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు ఐఐపీహెచ్ శాస్త్రవేత్తలు. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ ఆ వైరస్‌ సోకడం లేదని వారు తెలిపారు. కోవిడ్‌–19తో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఆ వైరస్‌ అంటుకోని ఉదాహరణలున్నాయని ఆ సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ మవలాంకర్‌ వివరించారు. కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశాలపై అం తర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. అహ్మదాబాద్‌లో కేసు ల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమే కావచ్చని ఆయన వివరించారు. యూనివర్సిటీ కా లేజ్‌ ఆఫ్‌ లండన్‌ న్యూరో సైంటిస్ట్‌ కార్ల్‌ ఫ్రిస్టన్‌ ప్రతిపాదించిన ‘ఇమ్యూనలాజికల్‌ బ్లాక్‌ హోల్‌’సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్‌ సోకదని వివరించారు. ఇమ్యూనిటీ పెరిగిన శరీరాలకు వైరస్ అంత ఈజీగా చేరదని, అలాగే, జనం ఇళ్లకే పరిమితమవడం వల్ల కరోనా ప్రభావం తగ్గుమొఖం పడుతోందంటున్నారు దిలీప్‌ మవలాంకర్‌. జనం ఇప్పటికే హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయికి చేరుకున్నారని ఆయన తెలిపారు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu