Noise Endeavour Smartwatch: నాయిస్ నుంచి అత్యంత దృఢమైన స్మార్ట్ వాచ్.. అనువైన ధరలోనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..

| Edited By: Ravi Kiran

Dec 08, 2023 | 8:10 PM

అనువైన బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు, క్లాసిక్ డిజైన్లో నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ లు వస్తుంటాయి. ఇదే క్రమంలో నాయిస్ కంపెనీ డిసెంబర్ 5వ తేదీన మరో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దాని పేరు నాయిస్ ఫిట్ ఎన్డీవర్. ఇది రగ్గడ్ డిజైన్ తో వస్తుంది. అంటే దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను కూడా నాయిస్ అనువైన బడ్జెట్లోనే లాంచ్ చేసింది.

Noise Endeavour Smartwatch: నాయిస్ నుంచి అత్యంత దృఢమైన స్మార్ట్ వాచ్.. అనువైన ధరలోనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..
Noisefit Endeavour Smartwatch
Follow us on

స్మార్ట్ వాచ్ లకు మన దేశంలో మార్కెట్ బాగానే పెరిగింది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే బ్రాండ్లకు డిమాండ్ బాగా ఉంటోంది. ఆ కోవలోకే వస్తుంది నాయిస్ కంపెనీ. అనువైన బడ్జెట్లో బెస్ట్ ఫీచర్లు, క్లాసిక్ డిజైన్లో నాయిస్ కంపెనీ స్మార్ట్ వాచ్ లు వస్తుంటాయి. ఇదే క్రమంలో నాయిస్ కంపెనీ డిసెంబర్ 5వ తేదీన మరో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దాని పేరు నాయిస్ ఫిట్ ఎన్డీవర్. ఇది రగ్గడ్ డిజైన్ తో వస్తుంది. అంటే దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను కూడా నాయిస్ అనువైన బడ్జెట్లోనే లాంచ్ చేసింది. రూ. 2,999 బేస్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ వింటేజ్ బ్రౌన్, ఫియారీ ఓరెంజ్, టీల్ బ్లూ, కామో బ్లాక్, జెట్ బ్లాక్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అడ్వెంచరిస్టుల కోసం..

నాయిస్ మాట్లాడుతూ ఎండీవర్ సాహస ఔత్సాహికుల కోసం ఉద్దేశించబడింది, ఎస్ఓఎస్ తో సహా ఫీచర్లు ఉన్నాయి. ఇది వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా వారి ప్రత్యక్ష స్థానాన్ని తక్షణమే భాగస్వామ్యం చేయడానికి, కేవలం 8 సెకన్లలోపు ఐదు అత్యవసర ఫోన్ కాంటాక్ట్ లను సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. 100 సెకన్లలో శరీర ఆరోగ్య నివేదికను అందించే రాపిడ్ హెల్త్ మెజర్‌మెంట్ టెక్నాలజీ ఇందులో ఉంటుంది.

నాయిన్ ఎన్డీవర్ డిజైన్ ఇలా..

ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.46-అంగుళాల హై-పిక్సెల్ అమోల్డ్ డిస్‌ప్లే 600 నిట్‌ల బ్రైట్‌నెస్, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, హృదయ స్పందన రేటు, ఎస్పీఓ2, నిద్ర విధానాలు వంటి ముఖ్యమైన ఆరోగ్య కొలమానాలను ట్రాక్ చేయడానికి వెల్‌నెస్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఒత్తిడి స్థాయిలు, శ్వాస వ్యాయామాలు. నీరు, ధూళి నిరోధకత కోసం వాచ్ ఐపీ68గా రేటింగ్ ఇచ్చారు. స్మార్ట్‌వాచ్ ఇటీవలి కాల్ లాగ్‌లను యాక్సెస్ చేయడానికి, గరిష్టంగా 10 పరిచయాలను సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఈ నాయిస్ ఎన్డీవర్ స్మార్ట్ వాచ్ ను నాయిస్ అధికారిక వెబ్ సైట్లో కేవలం రూ. 2,999కే కొనుగోలు చేయొచ్చు. ఇది వింటేజ్ బ్రౌన్, ఫియారీ ఓరెంజ్, టీల్ బ్లూ, కామో బ్లాక్, జెట్ బ్లాక్ వంటి ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఎటువంటి సాహస కార్యక్రమాలకు అయినా ఇది ఉపయోగపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..