కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్లలోపు పిల్లలను, 65ఏళ్లు దాటినవారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం లేదు టీటీడీ. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. తిరుమల వెంకన్న దర్శనానికి వృద్ధులకు.. రోజుకు 2 స్లాట్లు కేటాయించినట్టు వైరలయ్యాయి. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
కాగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను ఇటీవల టీటీడీ పెంచిన విషయం తెలిసిందే. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో నియంత్రణకు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే సర్వదర్శన టోకెన్లు జారీ చేసేవారు. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలోనూ టికెట్ల జారీని స్టార్ట్ చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, కరోనా నేపథ్యంలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల సెంటర్లను టీటీడీ పెంచింది.
విష్ణునివాసంలో 24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 3 వేల నుంచి 10 వేల వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించింది. దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తుండగా.. సర్వదర్శనానికి సంబంధించి ఒకరోజు ముందుగా టికెట్లను జారీ చేస్తున్నారు.
Also Read :
రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు
శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర