సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు

ఈ జనరేషన్‌ లో నెంబర్‌ వన్ హీరో ఎవరు..? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్‌ చెప్పటం కాస్త కష్టమే.. కానీ నటుడిగా సీనియర్ల మెప్పు కూడా పొందిన హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని వెంటనే చెప్పేయొచ్చు.

సీనియర్ హీరోయిన్ల ఫేవరెట్ యాక్టర్‌గా మారిన జూనియర్ రామారావు
Follow us

|

Updated on: Nov 19, 2020 | 10:37 AM

ఈ జనరేషన్‌ లో నెంబర్‌ వన్ హీరో ఎవరు..? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్‌ చెప్పటం కాస్త కష్టమే.. కానీ నటుడిగా సీనియర్ల మెప్పు కూడా పొందిన హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని వెంటనే చెప్పేయొచ్చు. ఒకప్పటి టాప్ హీరోయిన్స్‌ కూడా  తారక్ యాక్టింగ్‌కు ఫిదా అంటున్నారు. తెలుగులో బెస్ట్ డ్యాన్సర్‌గా, ఆర్టిస్ట్‌గా, మాస్ హీరోగా ఎన్టీఆర్‌కున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఫిలిం స్టార్స్‌ కూడా యంగ్‌ టైగర్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఓల్డ్ జనరేషన్‌ హీరోయిన్స్‌ ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఫిదా అవుతున్నారు.

సీనియర్ నటి అర్చన గుర్తున్నారా…. ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ అందరికీ ఫేవరేటే. రెండుసార్లు నేషన్ అవార్డ్ కూడా అందుకున్నారు ఈ నటి. తాజాగా ఈమె ఎన్టీఆర్‌ అద్భుతమైన నటుడంటూ ఆకాశానికెత్తేశారు. ఓ టీవీ షోలో పాల్గొన్న అర్చన… ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ గురించి కామెంట్ చేశారు. జనతా గ్యారేజ్‌ సినిమాలో మోహన్‌ లాల్‌ లాంటి స్టార్ పక్కన కూడా తారక్‌ యాక్టింగ్ సూపర్బ్ అంటూ కితాబిచ్చారు.

మరో సీనియర్ నటి ఖుష్బూ అయితే ఎన్టీఆర్‌ పేరు చెబితే చాలు మురిసిపోతూ మై ఫేవరెట్ అనేస్తారు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఖుష్బూ అప్పటి నుంచి తారక్‌కు వీరాభిమానిగా మారిపోయారు. అంతేకాదు అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఎన్టీఆర్ మై ఫేవరెట్‌ అంటూ గర్వంగా చెప్పుకుంటారు.

మరో సీనియర్ నటి ఈశ్వరీ రావు కూడా ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈశ్వరీ.. ఆ తరువాత ఎన్టీఆర్‌ బెస్ట్ యాక్టర్‌ అంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఈ జనరేషన్ ఆడియన్స్‌నే కాదు.. ఓల్డ్ జనరేషన్‌ స్టార్స్‌ను కూడా మెప్పిస్తూ ది బెస్ట్ అనిపించుకుంటున్నారు తారక్‌.

Also Read :

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

ప్రకాశం జిల్లాలో పులి పంజా, నాలుగు ఆవులు మృతి !

శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!