Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ పై పోరులో ముందంజ, గత 24 గంటల్లో ఒక్క కరోనా డెత్ కేసు కూడా నమోదు కాలేదన్న కేంద్రం

కోవిడ్ పై పోరులో ముందంజ వేస్తున్నామని కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ మృతి కేసు ఒకటి కూడా నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కోవిడ్ పై పోరులో ముందంజ, గత 24 గంటల్లో ఒక్క కరోనా డెత్ కేసు కూడా నమోదు కాలేదన్న కేంద్రం
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2021 | 6:05 PM

కోవిడ్ పై పోరులో ముందంజ వేస్తున్నామని కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ మృతి కేసు ఒకటి కూడా నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రోజువారీ కరోనా వైరస్ కేసులు కూడా చాలావరకు తగ్గాయని నీతి ఆయోగ్ సభ్యడు డాక్టర్ వీ.కె. పాల్ వెల్లడించారు. కానీ 70 శాతం జనాభా ఇంకా ఈ వైరస్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ముందుజాగ్రత్త చర్యలు అవసరమని ఆయన చెప్పారు. గత వారంలో 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ మృతి కేసులు నమోదు కాలేదని ఆయన అన్నారు.  కాగా- దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నాలుగో వారంలోకి ప్రవేశించింది. జనవరి 16 న తొలి డోసు తీసుకున్నవారు ఈ నెల 13 న రెండో డోసు తీసుకోవలసి ఉంటుంది. మరోవైపు-ఒక రోజులో 9,110 కొత్త వైరస్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. 1,05,48,521 మంది కరోనా రోగులు కోలుకున్నారు.

ఇప్పటివరకు దేశంలో సుమారు 58 లక్షలమంది కరోనా వైరస్ టీకామందులు తీసుకున్నట్టు కేంద్రం ఇటీవల వెల్లడించింది. no covid deaths inlast 24 hours in 15 states, uts says centre, delhi, coronavirus, no deaths in 24 hours, 15 states, union territories, health ministry,

Read More:చైనా చెప్పింది నిజమే, వూహాన్ ల్యాబ్ నుంచి కోవిడ్ వైరస్ లీక్ కాలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు

Read More:కోవిడ్ జంతుమూలాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కనుగొనలేకపోయారు, చైనా శాస్త్రజ్ఞుడు