AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు

దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు.

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు
Rahul Gandhi Press Meet
Balaraju Goud
|

Updated on: Jul 22, 2026 | 5:06 PM

Share

దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్‌లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు.

మీడియా సమావేశం ప్రారంభంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు సంబంధించిన వీడియోను ప్రదర్శించిన రాహుల్ గాంధీ, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ భవిష్యత్తును కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన విద్యార్థులను కొట్టడం దారుణమని అన్నారు. యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం వారి ఆవేదనను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల సుమారు 7.5 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ కేసుల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని, విద్యా వ్యవస్థను దెబ్బతీసిన వారిని శిక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో మాత్రం విఫలమైందని విమర్శించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. మొదటిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండవదిగా విద్యార్థులపై లాఠీచార్జ్‌కు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మూడవదిగా దేశ యువతకు, విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే పారదర్శకమైన పరీక్షల నిర్వహణ, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు, బాధ్యులపై శిక్షలు తప్పనిసరని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లోనూ, ప్రజల మధ్యనూ బలంగా లేవనెత్తుతామని స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలు, డిమాండ్లపై ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..