Telangana: అయ్యో సౌమ్య.. మృత్యువుతో పోరాడి ఓడిన కానిస్టేబుల్..
తెలంగాణ నిజామాబాద్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాదాపు 9 రోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య.. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

తెలంగాణ నిజామాబాద్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య దాదాపు 9 రోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయింది. గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో తీవ్రంగా గాయపడిన సౌమ్య.. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో సౌమ్య కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ నగర శివారులో గతనెల 23న గంజాయి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గంజాయ్ ముఠాను పట్టుకునేదుకు ఎక్సైజ్ ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సౌమ్య.. గంజాయి స్మగ్లర్లు కారును ఆపడానికి ప్రయత్నించగా.. వారు సిబ్బందిపైకి పోనిచ్చారు. ఈ ఘటనలో సౌమ్య తీవ్రంగా గాయపడింది.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. హైదరాబాద్ నిమ్స్‌కి తరలించి చికిత్స అందించారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య.. 8రోజులుగా అపస్మారక స్థితిలోనే ఉంది. రెండు వైపులా పక్కటెముకలు విరిగిపోయాయి.. మల్టీ ఆర్గన్స్ దెబ్బతిన్నాయి.. డామేజ్ అయిన కిడ్నీని సైతం తొలగించారు. చివరికి మృత్యువుతో పొరాడుతూ.. సౌమ్య మరణించింది.
సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే ఎంతో ఇష్టం. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి మాఫియాను పట్టుకునేందుకు వెళ్లిన సౌమ్య.. అదే ముఠా కారణంగా ఆస్పత్రిపాలు అవుతుందని ఊహించలేకపోయింది. సౌమ్య చావుకు కారణమైన స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు..
20 నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది సౌమ్య. సౌమ్యకు పోలీస్ జాబ్ అంటే ఎంతో ఇష్టమని, మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిందన్నారు కుటుంబసభ్యులు. గంజాయి మాఫియాను పట్టుకునేందుకు వెళ్లిన సౌమ్య.. ఇలా బలైపోతుందని ఊహించలేకపోయామంటోంది సౌమ్య తల్లి.
