దీపావళి టపాసుల వాడకంపై కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు

కరోనా విజృంభిస్తున్న వేళ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి బాణాసంఛాపై నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్.

దీపావళి టపాసుల వాడకంపై కేంద్రానికి గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసు
Follow us

|

Updated on: Nov 02, 2020 | 9:44 PM

కరోనా విజృంభిస్తున్న వేళ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు దీపావళి బాణాసంఛాపై నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వాడకాన్ని నిషేధించాలనే ఎన్జీటీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వాయుకాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఈ నెల 7 నుంచి 30 వరకు టపాసులు కాల్చడంపై నిషేధించం విధించాలన్న ఆలోచనపై ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతోపాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరింది ఎన్జీటీ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, ఢిల్లీ పోలీసు కమిషనర్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా సహాయపడటానికి ఎన్జీటీ సీనియర్ న్యాయవాది రాజ్ పంజ్వానీ, న్యాయవాది శిభానీ ఘోష్‌ను ఎన్జీటీ నియమించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి తీవ్రత కారణంగా గాలి నాణ్యత క్షిణించిందని ఎన్జీటీ పేర్కొంది. ఇలాంటి సమయంలో దీపావళి టపాసులను కాల్పడం ద్వారా మరింత వాయు కాలుష్యం పెరిగిపోతుందని, దీంతో ప్రజల్లో వ్యాధులు ప్రబలడానికి కారకులవుతున్నారని, దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంతోష్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన ఇండియన్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ నెట్‌వర్క్ చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించింది. పండుగ సమయంలో వాయు కాలుష్యం కారణంగా కొవిడ్‌-19 కేసులు పెరుగుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి, ఢిల్లీ ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటనను ఈ పిటిషన్‌కు జత చేశారు.

ఇదిలాఉండగా, ఎంపిక చేసిన 800 బహిరంగ ప్రాంతాల్లోనే టపాసులు కాల్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాగా, రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది దీపావళి టసాసులు వాడకంపై నిషేధం విధించింది. అయితే, దీపావళి టపాసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..