వాట్సాప్‌తో డబ్బులు దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!

అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాలను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దోపిడీ చేసేందుకు వాట్సాప్‌ యాప్‌ను ఎంచుకున్నారు. యూజర్లకు మెసేజ్‌లు పంపిస్తూ.. వాటి ద్వారా నగదును దోచేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ముందుగా నేరగాళ్లు వాట్సాప్‌లో మనీ రిక్వెస్ట్ మెసేజ్‌లను యూజర్లకు పంపిస్తున్నారు. ఇక వచ్చిన ఆ సందేశాన్ని ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు గల్లంతయినట్లే. ఒక్క సందేశాలు […]

వాట్సాప్‌తో డబ్బులు దోచేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త!
Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: Dec 28, 2019 | 5:30 AM

అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పంథాలను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దోపిడీ చేసేందుకు వాట్సాప్‌ యాప్‌ను ఎంచుకున్నారు. యూజర్లకు మెసేజ్‌లు పంపిస్తూ.. వాటి ద్వారా నగదును దోచేస్తున్నారు ఈ కేటుగాళ్లు.

ముందుగా నేరగాళ్లు వాట్సాప్‌లో మనీ రిక్వెస్ట్ మెసేజ్‌లను యూజర్లకు పంపిస్తున్నారు. ఇక వచ్చిన ఆ సందేశాన్ని ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే చాలు.. బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు గల్లంతయినట్లే. ఒక్క సందేశాలు మాత్రమే కాదు.. క్యూఆర్ కోడ్‌ ఇమేజ్‌లను కూడా పంపించి నగదు అడుగుతున్నారు. ఈ కోడ్‌లను స్కాన్ చేస్తే మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయని నమ్మిస్తున్నారు. నిజానికి మనీ వారి ఖాతాలోకి జమ అవుతుంది. ఇలాంటి తరహా మోసాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. అంతేకాకుండా కొంతమంది బాధితులు ఈ బారిన పడి డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. అందుకే ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్‌కు వస్తే ఓపెన్ చేయకూడదని ఐటీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు.