AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ‌వార్త …ఇక‌పై వారికి కూడా 35 కేజీల రేషన్ బియ్యం..!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంత్యోదయ అన్న యోజన పథకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువ‌రించింది.

శుభ‌వార్త ...ఇక‌పై వారికి కూడా 35 కేజీల రేషన్ బియ్యం..!
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2020 | 8:00 PM

Share

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంత్యోదయ అన్న యోజన పథకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువ‌రించింది. దీంతో దివ్యాంగులకు ల‌బ్ది చేకూర‌నుంది. దివ్యాంగులకు రేషన్ స్కీమ్ ప్రయోజనాలు అందడం లేద‌నే అంశంపై ఢిల్లీ ఉన్నత న్యాయ‌స్థానం చేసిన ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని 2000 డిసెంబర్ 25న ప్రారంభించింది. దీని ద్వారా అతి త‌క్కువ ధ‌ర‌లకే పేద‌ల‌కు బియ్యం లేదా గోధుమలు అందిస్తోంది. 2003లోనే ఈ ప‌థకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందువ‌ల్ల‌నో ప‌లుచోట్లు వీరికి ప‌థ‌కం యొక్క ప్ర‌యోజ‌నాలు లభించడం లేదని రామ్ విలాస్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.

అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కలిగిన వారికి 35 కేజీల బియ్యం లేదా గోధుమలు రాష్ట్రాలే అందించాల‌ని రామ్ విలాస్ పాశ్వాన్ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచ‌న‌లు చేశారు. అంత్యోదయ అన్న యోజన ప‌థ‌కంలో చేరిన వారికి ఒక ప్రత్యేకమైన కార్డు ఇస్తారు. దీని ద్వారా రేషన్ బియ్యం లేదా గోధుమ‌లు తీసుకోవచ్చు. అర్హులు బియ్యం అయితే కేజీకి రూ.3 చొప్పున..గోధుమ‌లు అయితే రూ.2 చొప్పున‌ 35 కేజీలు పొందొచ్చు. అంతేకాకుండా సెంట్ర‌ల్ గ‌వర్న‌మెంట్ మరో విషయాన్ని కూడా స్ప‌ష్టంగా చెప్పింది. గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఫ్రీగా అందజేయాలని రాష్ట్రాలకు మరోసారి తెలియజేసింది.

Follow Us
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..