AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌరసత్వ చట్టంలో చిన్న మార్పు.. ఈశాన్య రాష్ట్రాలే టార్గెట్ !

పౌరసత్వ చట్ట (సవరణ) బిల్లులో ఓ ప్రత్యేక క్లాజును చేరుస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనివల్ల నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదెశ్గ్ వంటి ఈశాన్య రాష్ట్రాలకు.”ఊరట’ కలుగుతుందని అన్నారు. ఈ క్లాజుతో ఈ రాష్ట్రాలను కేంద్రం టార్గెట్ చేసినట్లయింది. శనివారం మిజోరాం సీఎం జొరాంతంగా తోను, ప్రభుత్వేతర సంస్థల నేతలతోనూ వేర్వేరుగా సమావేశమైన ఆయన.. సెటిలర్ల నుంచి ఈ రాష్ట్రాలకు వచ్ఛేవారితో ఎదురవుతున్న సమస్యను తెలుసుకున్నారు. సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర […]

పౌరసత్వ చట్టంలో చిన్న మార్పు.. ఈశాన్య రాష్ట్రాలే టార్గెట్ !
Anil kumar poka
|

Updated on: Oct 06, 2019 | 5:14 PM

Share

పౌరసత్వ చట్ట (సవరణ) బిల్లులో ఓ ప్రత్యేక క్లాజును చేరుస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనివల్ల నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదెశ్గ్ వంటి ఈశాన్య రాష్ట్రాలకు.”ఊరట’ కలుగుతుందని అన్నారు. ఈ క్లాజుతో ఈ రాష్ట్రాలను కేంద్రం టార్గెట్ చేసినట్లయింది. శనివారం మిజోరాం సీఎం జొరాంతంగా తోను, ప్రభుత్వేతర సంస్థల నేతలతోనూ వేర్వేరుగా సమావేశమైన ఆయన.. సెటిలర్ల నుంచి ఈ రాష్ట్రాలకు వచ్ఛేవారితో ఎదురవుతున్న సమస్యను తెలుసుకున్నారు. సాధారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ఇతర దేశాలు, ప్రాంతాలవారు శరణార్థులుగా ఈ రాష్ట్రాలకు వచ్చి చిన్నా, చితకా వ్యాపారాలో, పనులో చేసుకుంటూ స్థిరపడుతుంటారు. వీరివల్ల ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ఇబ్బంది తలెత్తుతోంది. వీరికి భారతీయ పౌరసత్వ చట్టం వర్తించదు. మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇన్నర్ లైన్ పర్మిట్ అనే సిస్టం ని పాటిస్తున్నాయి. పరాయి దేశాల నుంచి వచ్ఛే వారి ప్రవేశాన్ని ఈ సిస్టం రెగ్యులేట్ చేస్తోంది. అంటే వారికి పరిమిత కాలానికి మించి ఈ రాష్టాల్లో ఉండే హక్కు లేదు. కానీ వారు గడువుకు మించి ‘ పాతుకుపోవడం ‘ ఈ స్టేట్స్ కు తలనొప్పిగా మారుతోంది. స్థానికులు, స్థానికేతరుల మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఏర్పడుతున్నాయి. ప్రతిపాదిత బిల్లులో స్పెషల్ క్లాజును జొప్పిస్తామని షా హామీ ఇచ్చ్చారని, పార్లమెంటులో ఈ సవరణ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారని జొరాంతంగా.. ఆయనతో భేటీ అనంతరం వెల్లడించారు. ఈ ప్రత్యేక నిబంధనలో ఇన్నర్ లైన్ సిస్టం కూడా చేరి ఉంటుందన్నారు. కాగా-విదేశీ శరణార్థులకు వ్యతిరేకంగా తాము ఆందోళన కొనసాగిస్తామని మిజో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్…. వన్ లాల్ రౌటా పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ సవరణబిల్లు ప్రవేశపెట్టే ముందు ముసాయిదా చట్టంపై చర్చించేందుకు షా అంగీకరించారని ఆయన తెలిపారు. షా మిజోరాం సందర్శన సందర్భంగా పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని ఈ కమిటీ మొదట భావించినప్పటికీ, ఆ తరువాత ఈ యోచనను విరమించుకుంది. ఆ మధ్య అస్సాంలో కూడా దాదాపు ఇదే విధమైన సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వఛ్చిన శరణార్థులతో ఆ రాష్ట్రం దాదాపు ‘ కిక్కిరిసి ‘ పోవడంతో కేంద్రం ఎన్నార్సీ అమలు చేసింది. ఆ ప్రక్రియలో సుమారు 19 లక్షల మంది అనర్హులుగా తేలారు.