AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం

కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాయి దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపాల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైరల్ వీడియోకు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం, తేదీ, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇప్పటివరకు స్పష్టత లేదు.

Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం
Massive Rock Hits Bus,
Balaraju Goud
|

Updated on: Aug 12, 2026 | 6:41 PM

Share

కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాయి దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపాల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైరల్ వీడియోకు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం, తేదీ, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇప్పటివరకు స్పష్టత లేదు.

వైరల్ వీడియోలో ఓ కొండ ప్రాంతంలోని రహదారి కనిపిస్తుంది. రోడ్డుకు ఒకవైపు పెద్ద మొత్తంలో రాళ్లు, శిథిలాలు ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా కొండపై నుంచి భారీ రాయి కిందికి దూసుకొచ్చింది. పెద్ద శబ్దంతో రాయి రోడ్డువైపు దూసుకువచ్చి.. అక్కడ ప్రయాణిస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. భారీ రాయి బస్సును బలంగా ఢీకొన్న వెంటనే దుమ్ము మేఘం కమ్ముకోవడంతో కొద్దిసేపు అక్కడ ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు.

బండరాయి పరిమాణాన్ని బట్టి చూస్తే అది చిన్న రాయి కాదని, టన్నుల కొద్ది బరువున్న భారీ శిలగా కనిపిస్తోంది. ఢీకొట్టిన ధాటికి బస్సు ముందు, మధ్య భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బస్సు ఫ్రేమ్ సైతం నుజ్జునుజ్జయినట్లుగా కనిపిస్తుండగా.. భారీ రాయి కందకంవైపు దొర్లుకుంటూ వెళ్లిపోయింది. బస్సు పూర్తిగా లోయలోకి పడిపోకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.

అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారా? ఉంటే ఎంతమంది? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వైరల్ అవుతున్న వీడియోను ఆధారంగా చేసుకుని కొందరు ఇది నిజమైన ఘటన అని చెబుతుండగా, మరికొందరు వీడియో ఏఐ సృష్టించినదై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల వీడియోకు సంబంధించిన వాస్తవికత, ఘటన వివరాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

మరోవైపు, ఈ వీడియో కొండ ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది. వర్షాలు, కొండచరియలు, బలహీనమైన రాళ్ల కారణంగా భారీ బండరాళ్లు, కొండచరియలు ఎప్పుడు కిందికి జారిపడతాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. డ్రైవర్లకు స్పందించేందుకు కొన్ని సెకన్ల సమయం కూడా దొరకని ఇలాంటి ఘటనలు ఎంతటి ప్రమాదకరమో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us