అభివృధ్దికి సంస్కరణల అవసరం ఎంతో ఉంది, గతంలోని చట్టాలు భారమే. ప్రధాని మోదీ

అభివృధ్ది జరగాలంటే ఆమూలాగ్రంగా  సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత శతాబ్దంలోని కొన్ని చట్టాలు ప్రస్తుత తరుణంలో భారంగా మారాయని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో వీటి ఆవశ్యకత ఎంతో..

  • Umakanth Rao
  • Publish Date - 7:25 pm, Mon, 7 December 20
అభివృధ్దికి సంస్కరణల అవసరం ఎంతో ఉంది, గతంలోని చట్టాలు భారమే. ప్రధాని మోదీ

అభివృధ్ది జరగాలంటే ఆమూలాగ్రంగా  సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత శతాబ్దంలోని కొన్ని చట్టాలు ప్రస్తుత తరుణంలో భారంగా మారాయని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో వీటి ఆవశ్యకత ఎంతో ఉందని, అందువల్లే వీటిపై ప్రభుత్వానికి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. గత శతాబ్దంలోని రిఫామ్స్ మంచివే అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇవి భారంగా మారాయి అని మోదీ వ్యాఖ్యానించారు. రైతు చట్టాలకు నిరసనగా అన్నదాతలు ఆందోళన చేయడం, వాటికి అన్ని విపక్షాలు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ( ఈ నెల 8 న భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునివ్వడం, దీనికి ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ నిస్తున్న సంగతి విదితమే).

మా ప్రభుత్వం స్వచ్ఛమైన సంస్కరణలు తెస్తోంది. ఇదివరకటివి కేవలం నామమాత్రమే అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి జీవనాన్ని సులభతరం చేయడానికి, పెట్టుబడులు పెంచడానికి, ఆధునిక టెక్నాలజీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టును లాంచ్ చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రూ. 8,379.62  కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 29.4 కిలోమీటర్లతో…. రెండు కారిడార్లతో కూడుకున్నది. తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, సికింద్రా వంటి టూరిస్టు స్పాట్ లను రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లతో ఇది కలుపుతుంది. 5 సంవత్సరాల్లో ఇది పూర్తి కానుంది. 26 లక్షల ఆగ్రా జనాభాకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.