పబ్‌జీ గేమ్ ఆడుతున్న మోదీ..’షా’కు అసదుద్దీన్ చురకలు

దేశాన్ని పాలిస్తున్న బీజేపీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో తన విమర్శల దాడికి మరింత పదును పెంచారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ మోదీ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బీజేపీని అసదుద్దీన్ వదిలిపెట్టడం లేదు. తాజాగా అమిత్ షా చేసిన ట్వీట్‌పై సెటైర్ వేశారు అసుద్దీన్ ఓవైసీ. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మోదీ తన వాయుసేనను పంపి […]

పబ్‌జీ గేమ్ ఆడుతున్న మోదీ..'షా'కు అసదుద్దీన్ చురకలు
Follow us
Ram Naramaneni

| Edited By:

Updated on: Apr 23, 2019 | 7:33 PM

దేశాన్ని పాలిస్తున్న బీజేపీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో తన విమర్శల దాడికి మరింత పదును పెంచారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ మోదీ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బీజేపీని అసదుద్దీన్ వదిలిపెట్టడం లేదు. తాజాగా అమిత్ షా చేసిన ట్వీట్‌పై సెటైర్ వేశారు అసుద్దీన్ ఓవైసీ. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మోదీ తన వాయుసేనను పంపి పాకిస్థాన్‌లో టెర్రరిస్టులపై దాడి చేయించారంటూ  అమిత్ షా ట్వీట్ చేశారు. షా చేసిన ఈ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ అసదుద్దీన్ ఓవైసీ వ్యంగ్యంగా కౌంటర్ ట్వీట్ పోస్టు చేశారు. ‘మోదీజీ సైన్యం, మోదీజీ ఎయిర్ ఫోర్స్, మోదీజీ న్యూక్లియర్ బాంబు… భారత్ దేశానికి సంబంధించిన ఏయే ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఈ ఐదేళ్లలో మోదీవి అయిపోయావంటూ… వెటకారంగా ట్వీట్ చేశారు ఓవైసీ. దేశాన్ని పాలిస్తున్నారా ? లేక పబ్‌జీ గేమ్ ఆడుతున్నారా ? అంటూ విమర్శించారు.

ఫిబ్రవరి 13న పుల్వామా ఉగ్రదాడిలో 44మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత భారత వాయుసేన పాకిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ప్రచారంలో అమిత్ షా ప్రస్తావిస్తూ… మోదీ తన వాయుసేనను పంపి పాకిస్తాన్‌లో టెర్రరిస్టులపై దాడికి దిగారని వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా భారత భద్రత బలగాల్ని మోదీజీకి సేనా అంటూ కామెంట్స్ చేసిన కొన్నిరోజులకే.. అమిత్ షా కూడా మోదీకి వాయుసేన అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా సైన్యాన్ని తమ సొంత బెనిఫిట్స్ కోసం వాడుకుంటున్నారంటూ..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాాంధీ, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే.