స్త్రీ జాతిని అవమాన పరిచే విధంగా షో నడిచింది.. బిగ్ బాస్ పైన మండిపడ్డ సీపీఐ నారాయణ

తెలుగులో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచేలా బిగ్ బాస్ షో ఉందని ఆయన అన్నారు.

  • Rajeev Rayala
  • Publish Date - 5:42 pm, Sun, 27 December 20
స్త్రీ జాతిని అవమాన పరిచే విధంగా షో నడిచింది.. బిగ్ బాస్ పైన మండిపడ్డ సీపీఐ నారాయణ

తెలుగులో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాలిటీ షో పై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచేలా బిగ్ బాస్ షో ఉందని ఆయన అన్నారు. మనదేశం మాతృదేశం. మహిళలకు ఇచ్చే ప్రాముఖ్యతకు మనదేశం అద్దంపట్టేలా ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఇచ్చే మహిళల పట్ల అవమానకరంగా బిగ్ బాస్ షో ఉందని అన్నారు. బిగ్ బాస్ షో ప్రారంభంలో నాగార్జున ఒక హీరోని స్టేజ్ పైకి పిలిచి ముగ్గురు హీరోయిన్స్ ఫోటోలను అక్కడ ఉంచి వారిలో ఎవరిని ముద్దుపెట్టుకుంటావ్.?, ఎవరితో డేటింగ్ చేస్తావ్.?, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.? అని ప్రశ్నించాడు. దానికి ఆ హీరో ఒక హీరోయిన్ ను ముద్దు పెట్టుకుంటానని, మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తానని, మరో హీరోయిన్ ను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. అంటే ఇంత బహిరంగంగా స్త్రీ జాతిని అవమాన పరిచే విధంగా బిగ్ బాస్ షో నిర్వహించారు. డబ్బులకు కకృత్తి పడి నాగార్జున లాంటి హీరోలు ఇలాంటివి చేయడం చాలా అవమానకరంగా ఉంది అని నారాయణ అన్నారు. మరి నాగార్జున ఇంట్లో ఉన్న హీరోయిన్స్ తో ఎందుకు అలా చేయలేదంటూ ఆయన ప్రశ్నించారు. మహిళలకే వివక్షత అంటే వివక్షతలో మరో వివక్షతా..? ఇది చాలా ఘోరం.. ఎంత డబ్బులు ఉంటే మాత్రం ఇలా స్త్రీజాతిని అవమాన పరిచేవిధంగా వ్యవహరించడం సరికాదు అని ఆయన అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అలాగే కోర్టుకు వెళ్తే కేసును రిజక్ట్ చేసింది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలిపారు నారాయణ. ఇంతప్రయత్నిస్తున్న కేసు తీసుకోవడానికి చట్టాలుకూడా బయపడుతున్నాయని నారాయణ తెలిపారు. స్త్రీజాతికి బిగ్ బాస్ నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.