మాజీ కేంద్ర మంత్రి రాజెన్ గోహైన్ సంచలన వ్యాఖ్యలు.. పాకిస్తాన్, చైనాలకు బారత్‌లో కాంగ్రెస్ ఏజెంట్ అంటూ కామెంట్
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజెన్ గోహైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. పాకిస్తాన్, చైనా ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని రాజెన్ గోహైన్ ఆరోపించారు.
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజెన్ గోహైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. పాకిస్తాన్, చైనా ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని రాజెన్ గోహైన్ ఆరోపించారు. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని సార్లు పాకిస్తాన్ ఏజెంట్‌గా, మరికొన్ని సార్లు చైనా ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి..
కాంగ్రెస్ నిజమైన దేశభక్తుల పార్టీ కాదని రాజెన్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమ స్వార్థ రాజకీయలకే ప్రాధాన్యతనిస్తుందన్న ఆయన.. దేశ ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోదన్నారు. దేశవ్యాప్తంగా వేర్పాటువాదులకు మద్దతిచ్చి, వారి మద్దతుతో అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. చాలా రోజులుగా కాంగ్రెస్‌ది ఇదే తంతు కొనసాగిందని తీవ్రంగా ఆరోపించారు. ఇంతకుముందు ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. పాకిస్తాన్ తన రాజకీయ స్వార్థాన్ని నెరవేర్చడానికి ఈ రోజు కాంగ్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు” అని గోహైన్ అన్నారు. దేశానికి కాంగ్రెస్ ఏమాత్రం సరిపోదని ప్రజలు గ్రహించారని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను కాదని దేశ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను కేవలం బీజేపీ మాత్రమే కాపాడుతుందన్న భావనకు ప్రజల్లోకి వచ్చిందని రాజెన్ గోహైన్ అన్నారు.