‘రాహుల్ జీ ! ఆ నాడు మీరేం చెప్పారు ? ఇప్పుడు మీరేం చేస్తున్నారు ? ‘ నాటి వీడియోతో జేపీ నడ్డా ఫైర్, ట్వీట్స్ తో మండిపాటు
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకపడ్డారు. హిపోక్రసీకి మీరు మరో పేరని అన్నారు. రైతులను మీరు తప్పుదారి పట్టిస్తున్నారని, ద్వంద్వ ప్రమాణాలు..

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకపడ్డారు. హిపోక్రసీకి మీరు మరో పేరని అన్నారు. రైతులను మీరు తప్పుదారి పట్టిస్తున్నారని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆరోపించారు. 2015 లో లోక్ సభలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల తాలూకు వీడియోను ఆయన విడుదల చేశారు. ఆ ప్రసంగంలో రాహుల్ .. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతూ.. మధ్య దళారులను తొలగించాలని, అన్నదాతలు తాము పండించిన పంట ఉత్పత్తులను ఏ ధరకైనా విక్రయించుకోవడానికి అనుమతించాలని కోరారు. అలాగే ఆయనకు, యూపీకి చెందిన ఓ రైతుకు మధ్య జరిగిన సంభాషణను కూడా దీనికి జోడించారు.
ये क्या जादू हो रहा है राहुल जी?
पहले आप जिस चीज़ की वकालत कर रहे थे, अब उसका ही विरोध कर रहे है।
देश हित, किसान हित से आपका कुछ लेना-देना नही है।आपको सिर्फ़ राजनीति करनी है।लेकिन आपका दुर्भाग्य है कि अब आपका पाखंड नही चलेगा। देश की जनता और किसान आपका दोहरा चरित्र जान चुके है। pic.twitter.com/Uu2mDfBuIT
— Jagat Prakash Nadda (@JPNadda) December 27, 2020
‘దీనిపై నడ్డా నేరుగా రాహుల్ ని ఉద్దేశించి..ఈ మ్యాజిక్ ఏమిటి ? గతంలో మీరేం చెప్పారు ? అందుకు వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తున్నదేమిటి ? మీ హిపోక్రసీ పని తీరును, ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు, రైతులు గమనిస్తున్నారు అని ట్వీట్ చేశారు. ఈ దేశ రైతుల ప్రయోజనాలు మీకు పట్టవన్నారు. రైతులను రెచ్ఛగొట్టడం ద్వారా వారిని మిస్ లీడ్ చేస్తున్నారు అని దుయ్యబట్టారు. రైతులను అయోమయానికి గురి చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు.



