పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న నితీష్ కుమార్.. జేడీయూ నూతన అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ ఎంపిక

బీహార్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్‌ ఎంపికయ్యారు.

పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్న నితీష్ కుమార్.. జేడీయూ నూతన అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ ఎంపిక
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 27, 2020 | 5:57 PM

బీహార్ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జనతాదళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడిగా రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్‌ను ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2019లో జేడీయూ అధ్యక్షుడుగా తిరిగి ఎంపికయ్యారు. అయితే, ఆయన పదవీకాలం మూడేళ్లూ పూర్తవడంతో ఈసారి ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో నూతన అధ్యక్షుడిగా రాంచంద్ర ప్రసాద్ సింగ్‌కు ఆ పదవి కట్టబెట్టారు. ఆదివారం జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దీనిపై చర్చించారు. అనంతరం అధ్యక్ష పదవికి బ్యూరోక్రాట్ అయిన ఆర్సీపీ సింగ్‌ను ప్రతిపాదించారు. పార్టీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఆయన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం జేడీయూ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే, ఇటీవల జేడీయూకు చెందిన ఆరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడంతో జేడీయూ అత్యవసరంగా ఈ సమావేశం నిర్వహించింది. పార్టీ భవిష్యత్తు గురించి, దేశంలో సంభవిస్తున్న రాజకీయ మార్పులను గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ, బీజేపీతో కలిసి అధికార పీఠం దక్కించుకున్నప్పటికీ.. సీట్లకు మాత్రం గండిపడింది. దీంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని భావించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు.