ఇన్‌స్టంట్ యాప్ రుణాల స్కామ్‌కు చైనాకు లింక్‌లు..పుణెలో ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
ఇన్‌స్టంట్ యాప్ రుణాల స్కామ్‌కు చైనాకు లింక్‌లు ఉన్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. సదరు కంపెనీలు భారతీయుల మొబైల్ ఫో్న్లను హ్యాక్ చేసి, వారి కాంట్రాక్ట్ సమాచారం తస్కరిస్తున్నాయని గుర్తించారు.

ఇన్‌స్టంట్ యాప్ రుణాల స్కామ్‌కు చైనాకు లింక్‌లు ఉన్నాయని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. సదరు కంపెనీలు భారతీయుల మొబైల్ ఫో్న్లను హ్యాక్ చేసి, వారి కాంట్రాక్ట్ సమాచారం తస్కరిస్తున్నాయని గుర్తించారు.
మొబైల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో లక్షల లోన్ పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పుణెలో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు పరశురామ్‌తోపాటు భార్య లియాంగ్ టియాన్, పరుశురామ్ అనుచరుడు షేక్ ఆకిబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారు 50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ సామాన్యులను వేదింపులకు గురి చేస్తున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. పట్టుబడినవారిలో ముగ్గురు చైనా జాతీయులని వారు వెల్లడించారు.
పుణే కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించిన పోలీసులు.. మహారాష్ట్ర పోలీసులతో కలసి దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి 101 ల్యాప్‌టాప్‌లు, 106 సెల్‌ఫోన్లు, టీపీ లింక్ రౌటర్, సీసీ కెమెరాలు, డీవీఆర్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోన్ యాప్ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.
దాదాపు 14 ఇతర నకిలీ లోన్ యాప్‌లను గుర్తించినట్లుగా సీపీ వెల్లడించారు. బబల్ లోన్, రూపీ బజార్, ఓకే క్యాష్, రూపీ ఫ్యాక్టరీ, పైసా లోన్, వన్ హోప్, క్యాష్ బీ, ఇన్ నీడ్, స్నాప్ లోన్, పిక్కి బ్యాంక్, క్రేజీ రూపీ, రియల్ రూపీ, రూపీ బియర్, రూపీ మోస్ట్‌లను గుర్తించినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 24 మంది అరెస్టయ్యారు. నిందితులు లోన్స్ తీసుకున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
