AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సర్కారుపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న వాళ్లే ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్..

ఏపీ సర్కారుపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు
Pardhasaradhi Peri
|

Updated on: Sep 08, 2020 | 10:01 PM

Share

ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న వాళ్లే ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది గుడి రథం దగ్ధం ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనుక ఉన్న ముఖ్య పాత్రధారులు ఎవరో బయటపడాలని.. వరుస ఘటనలకు కారణమైన వారు ఎంత పెద్దవాళ్లైనా శిక్షించాలని ఆయన అన్నారు. నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ కేంద్రంలో పరమేశ్వరమ్మ అనే కరోనా రోగి ఆత్మహత్య చేసుకోవడంపైనా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. బాధితురాలు కొవిడ్ కేంద్రంలో ఆత్మహత్య చేసుకుంటున్నా ఎవరూ గమనించకపోవడం దారుణమన్నారు. జేసీని, నోడల్ అధికారిని రాజకీయాలు చేసి అకస్మాత్తుగా బదిలీ చేశారని.. దాని పర్యవసానమే పేషెంట్లపై పర్యవేక్షణ కొరవడిందని చెప్పారు. కరోనా ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితికి ఇది నిదర్శనంటూ లోకష్ వరుస ట్వీట్లలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Follow Us