Namaste Trump: ‘నమస్తే ట్రంప్’..ఢిల్లీ, అహ్మదాబాద్ రెడీ టు వెల్ కమ్ !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొద్దిగంటల్లో ఇండియా చేరుకోనున్నారు. ఇందుకు ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలు  ఇప్పటికే అందంగా ముస్తాబయ్యాయి. ఈ రెండు సిటీల్లోని వీధుల్లో ట్రంప్, ప్రధాని మోదీల నిలువెత్తు కటౌట్లు, బ్యానర్లు వెలిశాయి. ట్రంప్ కు స్వాగతం చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు

Namaste Trump: 'నమస్తే ట్రంప్'..ఢిల్లీ, అహ్మదాబాద్ రెడీ టు వెల్ కమ్ !
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Feb 24, 2020 | 10:55 AM

Namaste Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొద్దిగంటల్లో ఇండియా చేరుకోనున్నారు. ఇందుకు ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలు  ఇప్పటికే అందంగా ముస్తాబయ్యాయి. ఈ రెండు సిటీల్లోని వీధుల్లో ట్రంప్, ప్రధాని మోదీల నిలువెత్తు కటౌట్లు, బ్యానర్లు వెలిశాయి. ట్రంప్ కు స్వాగతం చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు అనేకమందిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుని విజిట్ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ,, సర్కార్ దీన్ని పట్టించుకోకుండా  ఆయన టూర్ ని విజయవంతం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త దెబ్బ తిన్న నేపథ్యంలో.. ట్రంప్ రాక మళ్ళీ వీటిని పునరుజ్జీవింపజేయవచ్చ్చునని భావిస్తున్నారు. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఒక అత్యంత ప్రధానమైన వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని మొదట వార్తలు వఛ్చినప్పటికీ.. ట్రంప్ ప్రస్తుతానికి ఆ  అవకాశాలు లేవని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. వచ్ఛే నవంబరులో తమ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ ఒప్పందానికి తాము  అంత ప్రాధాన్యం ఇవ్వడంలేదని, ఆ ఎన్నికల ప్రక్రియ ముగిశాకే తాము ఈ డీల్ కుదుర్చుకోవచ్ఛునని ఆయన ఇదివరకే ప్రకటించారు.

రష్యన్ మిసైల్ షీల్డ్ సిస్టం నుంచి కోట్లాది డాలర్ల విలువైన హెలీకాఫ్టర్లను కొనుగోలు చేయాలని  భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఆయనను బుజ్జగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్ఛు.

కాగా-అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభ భాయ్ క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట బిగ్ ఈవెంట్ జరగనుంది. భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమం పట్ల ట్రంప్ ఎంతో ఆసక్తి చూపవచ్ఛునని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. గతః ఏడాది టెక్సాస్ లో జరిగిన ‘హౌడీ మోడీ’  కార్యక్రమాన్ని, దీన్ని అనేకమంది పోల్చి చూస్తున్నారని ఆయన చెప్పారు. అటు-ఈ ఈవెంట్ జరిగే రూట్ పొడవునా ట్రంప్ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో అటు-ఇటు ఎన్నో మురికివాడలున్నాయి. వాటిని ట్రంప్ చూడకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు నాలుగు అడుగుల ఎత్తయిన గోడను కట్టేశారు. అహ్మదాబాద్ నుంచి ట్రంప్, ఆయన కుటుంబం తాజ్ మహల్ సందర్శించేందుకు ఆగ్రా చేరుకోనున్నారు. ఈ పాలరాతి కట్టడం పొడవునా ఉన్న యమునా నది నీటిని అధికారులు నదిలోకి వదిలేశారు.  దీనివల్ల పారిశ్రామిక కాలుష్యాలు ఆయన కంట బడకుండా ఉంటాయట. ఇక ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ ఢిల్లీలోని ఓ స్కూల్లో విద్యార్థులతో కొంతసేపు గడపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్, డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియాలను ఆహ్వానించకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఇలా  ఉండగా ట్రంప్ రాక సందర్భంలో ప్రభుత్వం అత్యంత పటిష్టమైన మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu