కేటీఆర్ కు నామా ‘గిఫ్ట్ ఎ స్మైల్’

గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు భాగం అయ్యారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సుల‌‌ కొనుగోలు కోసం ఆయన ఆరు అంబులెన్సులకు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:22 pm, Sat, 5 September 20
కేటీఆర్ కు నామా 'గిఫ్ట్ ఎ స్మైల్'

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు భాగం అయ్యారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సుల‌‌ కొనుగోలు కోసం ఆయన ఆరు అంబులెన్సులకు గాను ఒక కోటీ ఇరవైమూడు లక్షల రూపాయ‌ల చెక్కును మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ మేరకు కేటీఆర్ కార్యాల‌యం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించింది. క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో రోగుల‌ను సత్వరమే ఆస్పత్రులకు చేర్చేందుకు వీలుగా అంబులెన్సుల కోసం విరాళాలు సేక‌రించేందుకు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌ శాఖ‌ మంత్రి కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేటీఆర్ పిలుపుకు విశేష స్పందన వ‌స్తోంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత‌లు అంబులెన్సుల కోసం భారీగా విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.