కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత, ప్రముఖుల ప్రాణాలు తీస్తోన్న మహమ్మారి
దేశంలో కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గినప్పటికీ మరణాల మాత్రం కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.

దేశంలో కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గినప్పటికీ మరణాల మాత్రం కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా మహమ్మారి చిన్నాపెద్ద, ధనిక పేద అని తేడా లేకుండా బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ కొవిడ్-19 బారిన పడి మృతి చెందారు. కరోనా కారణంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతోనే ఉన్న ఆయన.. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. 1969 డిసెంబర్ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో సురేంద్రసింగ్ జన్మించారు. 2007లో మొదటి సారి బిక్యాసెన్ నియోజకవర్గంనుంచి గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ నియోజవర్గంనుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సురేంద్రసింగ్ భార్య కొన్ని రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయారు.
Also Read :
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా