AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్స్

నాగ్ పూర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటినా ట్రయల్ మొదలుపెడుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్స్
Balaraju Goud
|

Updated on: Jun 12, 2020 | 2:03 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. ఇటు దేశంలో రోజు రోజుకీ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో కేంద్రం కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీ విధానానికి మెట్రోపాలిటన్ నగరాలకు అనుమతి నిచ్చింది, దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఫ్లాస్మా చికిత్స ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాగ్ పూర్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాటినా ట్రయల్ మొదలుపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 బాధితులను మొదటి దశలో ప్లాస్మా చికిత్స నిర్వహించాలని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలకు సగం మంది కోలుకున్న బాధితుల నుండి పొందిన రక్త ప్లాస్మాను రాష్ట్రంలో 500 మందికి పైగా బాధితులకు ఇవ్వవచ్చని అధికారులు పేర్కొన్నారు. తీవ్రమైన కోవిడ్ -19 రోగులకు ప్లాస్మా చికిత్స కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రయల్ కు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనకు DCGI ఆమోదం కూడా లభించింది. తొలుత 500 మందికి పైగా రోగులను కరోనా నుంచి విముక్తి లభిస్తుందని వైద్య శిక్షణ కార్యదర్శి డాక్టర్ సంజయ్ ముఖర్జీ గురువారం ట్వీట్ చేశారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) చివరి అనుమతి ఇచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా 23 ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 238 మంది బాధితులకు ఫ్లాస్మా థెరిపీ నిర్వహించాలని జిఎమ్‌సిహెచ్ నాగ్‌పూర్ యోచిస్తోంది. ఈ ఫ్లాస్మా థెరిపీతో ఆరు నెలల్లో కనీసం 5,000 మంది ప్రాణాలను కాపాడగలుగుతామని స్టేట్ నోడల్ ఆఫీసర్ మరియు ట్రయల్స్ కోసం అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ డాక్టర్ మొహద్ ఫైజల్ అభిప్రాయపడ్డారు. క్లిష్టమైన దశ నుంచి నయం చేయడం అనే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. చికిత్స ప్రభావవంతంగా ఉంటుందని, ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు సానుకూల ఫలితాలను సాధించామన్నారు. ఈ పరీక్షల ఫలితాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందన్న ఫైజల్.. భారతదేశంలో ప్లాస్మా చికిత్స కోసం ఐసిఎంఆర్ జాతీయ మార్గదర్శకాలను సవరించవచ్చని తెలిపారు.