నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి

గాల్వాన్ లోయలో భారత దేశం కోసం చైనా దళాలతో పోరాడి అసువులు బాసిన తన కుమారుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం..,

  • Umakanth Rao
  • Publish Date - 6:33 pm, Tue, 26 January 21
నా కుమారుడికి పరమ్ వీర్ చక్ర  పురస్కారాన్ని ప్రకటించాల్సింది, కల్నల్ సంతోష్ బాబు తండ్రి

గాల్వాన్ లోయలో భారత దేశం కోసం చైనా దళాలతో పోరాడి అసువులు బాసిన తన కుమారుడు కల్నల్ సంతోష్ బాబుకు ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రదానం చేయడంపట్ల ఆయన తండ్రి ఉపేంద్ర తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను వంద శాతం సంతృప్తిగా లేనని ఆయన అన్నారు. సంతోష్ కు పరమ్ వీర్ చక్ర అవార్డును ప్రకటించాల్సి ఉందని అన్నారు. తన కుమారుడు చూపిన ధైర్య సాహసాలు ఎంతోమంది రక్షణ సిబ్బందిని ప్రభావితం చేశాయని అయన చెప్పారు.గత ఏడాది జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా కన్నా ఇండియా శక్తిమంతమైన దేశమని తన కుమారుడు రుజువు చేశాడని ఉపేంద్ర అన్నారు.