Mutton Kadai Curry: ఓ వైపు కరోనా దీంతో రెస్టారెంట్స్ కు వెళ్లాలంటే భయం.. మరోవైపు రోజు ఇదేనా డిఫరెంట్ గా వండు అనే ఫ్యామిలీ సభ్యులు. అటువంటి మాంసాహార ప్రియుల కోసం రెస్టారెంట్ స్టైల్ లో స్పెషల్ కడై మటన్ గ్రేవీ కర్రీ తయారీ గురించి తెలుసుకుందాం.. !
మటన్ – 750 గ్రాములు ఉల్లిపాయలు- అభిరుచి బట్టి టమోటో ముక్కలు ఒక కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూన్ పచ్చిమిర్చి – 8 కారం గరం మసాలా మీట్ మసాలా పౌడర్ ధనియాల పొడి పసుపు కస్తూరి మేతి కొత్తిమీర ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత
ముందుగా ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో మటన్ , కొద్దిగా పసుపు వేసి తగినంత నీరు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ లో ప్రెజర్ తగ్గిసన తర్వాత ఆ మటన్ ను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. కాగే నూనెలో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, మరియు కారం వేసి ఈ మిశ్రమాన్ని వేయించాలి. మొత్తం వేగి కమ్మటి స్మెల్ వచ్చిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోయాలి. ఇప్పుడు అందులో కస్తూరి మేతీ , మీట్ మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలిపి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. ఆలా 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీరతో వేసి స్టౌ మీద నుంచి కిందకు దింపుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ కడై మటన్ గ్రేవీ రిసిపి రెడీ. ఇది అన్నంలోకి చపాతీల్లో కూడా బాగుటుంది.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ హ్యాంగ్ అయ్యిందా.. రీజన్స్ తెలిస్తే.. సాల్వ్ చేసుకోవడం ఈజీ