ముంబైలోని అంబేద్క‌ర్ ఇంటిపై దాడి..!

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వరండాతో పాటు ఇంటి అవరణలోని తోట ధ్వంసమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ముంబైలోని అంబేద్క‌ర్ ఇంటిపై దాడి..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 08, 2020 | 11:46 AM

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వరండాతో పాటు ఇంటి అవరణలోని తోట ధ్వంసమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటిలో బాబా సాహెబ్ వారసులు ప్రకాష్ అంబేద్కర్, ఆనందరాజ్ అంబేద్కర్ నివాసముంటున్నారు. ఈ సంఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పడినవారు ఎవరైన వదిలిపెట్టేది లేదని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామ‌ని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కాగా, గుర్తు తెలియ‌ని ఇద్దరు వ్యక్తులు త‌మ ఇంటిపై దాడి చేశార‌ని, సీసీటీవీని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించార‌ని ప్రకాష్ అంబేద్కర్ ఆరోపించారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ముమ్మారం చేశారు.