‘అమరావతిని కూల్చేద్దాం..హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం’
టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాత టీడీపీ నేతలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇటీవల తాజ్ మహల్ కృష్ణా నది ఒడ్డున ఉంటే కూల్చివేస్తారేమో అన్నట్టుగా ఓ ట్వీట్ చేసి అలజడి రేపారు కేశినేని నాని. తాజాగా ఆయన మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం.. అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ఏపీ సీఎం […]
టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాత టీడీపీ నేతలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇటీవల తాజ్ మహల్ కృష్ణా నది ఒడ్డున ఉంటే కూల్చివేస్తారేమో అన్నట్టుగా ఓ ట్వీట్ చేసి అలజడి రేపారు కేశినేని నాని. తాజాగా ఆయన మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేద్దాం.. అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు రెండు రోజుల పాటు సమావేశమై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఆస్తుల్ని ఆ ప్రభుత్వానికి అప్పగించడంపై కూడా చర్చకు వచ్చింది. ఇదే అంశాన్ని కేశినేని తన ట్వీట్‌లో వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది.
అమరావతిని కూల్చేద్దాం… హైదరాబాద్ ని అభివృద్ది చేద్దాం… pic.twitter.com/mwg2qqRYrB
— Kesineni Nani (@kesineni_nani) June 30, 2019